తెలంగాణ : నిర్మల్ పట్టణంలో మాంగళ్య షాపింగ్ మాల్ గురువారం ఘనంగా ప్రారంభమైంది.
మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ భాగ్యశ్రీ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
ఆదిలాబాద్ ఎంపీ గోడెం నాగేష్, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తితో కలిసి రిబ్బన్ కట్ చేసి మాల్‌ను ప్రారంభించారు.
భాగ్యశ్రీ మాల్‌లోని వివిధ విభాగాలకు వెళ్లి చీరలు, డ్రెస్సులను పరిశీలించారు.
అభిమానులకు హాయ్ చెప్పడంతో అక్కడ సందడి నెలకొంది.
అభిమానుల ఉత్సాహాన్ని చూసి భాగ్యశ్రీ రెండు స్టెప్పులేశారు.
అభిమానులు కేరింతలు కొడుతూ ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ఆసక్తి చూపారు.


