ఐపీఎల్ ఆల్‌టైమ్ జ‌ట్టు ఇదే.. రోహిత్ శ‌ర్మ‌కు నో ఛాన్స్‌ | Rajat Patidar picks his all-time IPL XI after 2026 edition | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ ఆల్‌టైమ్ జ‌ట్టు ఇదే.. రోహిత్ శ‌ర్మ‌కు నో ఛాన్స్‌

Aug 25 2026 3:12 PM | Updated on Aug 25 2026 3:21 PM

Rajat Patidar picks his all-time IPL XI after 2026 edition

PC: BCCI/IPL

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ తన ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. తను ఎంపిక చేసిన జట్టులో ఓపెనర్లుగా ఆర్సీబీ దిగ్గజాలు క్రిస్ గేల్, విరాట్ కోహ్లికి పాటిదార్ అవకాశమిచ్చాడు. కాగా ఈ లెజెండరీ క్రికెటర్లకు ఐపీఎల్‌లో అద్భుతమైన రికార్డు ఉంది.

గేల్ ఐపీఎల్‌లో ఓపెనర్‌గా 122 ఇన్నింగ్స్‌లలో 6 సెంచరీలు, 28 అర్ధసెంచరీలతో 4,489 పరుగులు సాధించాడు. విరాట్ 144 ఇన్నింగ్స్‌లలో ఏకంగా  5,684 పరుగులు నమోదు చేశాడు.  ఇందులో 9 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక మూడో స్ధానంలో ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్‌కు పాటిదార్ ఛాన్స్ ఇచ్చాడు. 

నాలుగు, ఐదు స్దానాల్లో ఐపీఎల్ లెజెండ్స్ సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్‌కు చోటు ద‌క్కింది. ఆల్‌రౌండ‌ర్ల కోటాలో హార్దిక్ పాండ్యాను  ర‌జ‌త్ ఎంపిక చేశాడు. అదేవిధంగా సీఎస్‌కే దిగ్గ‌జం ఎంఎస్ ధోనిని వికెట్ కీప‌ర్‌గా అవ‌కాశ‌మిచ్చాడు. ఈ ఆల్‌టైమ్ జ‌ట్టులో డేల్ స్టెయిన్, జ‌స్ప్రీత్ బుమ్రా పేస్ బౌలర్ల‌గా ఉండ‌గా.. చాహ‌ల్‌, సునీల్ న‌రైన్ స్పెష‌లిస్ట్ స్పిన్న‌ర్లగా చోటు సంపాదించుకున్నారు.

అయితే ఈ ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌ను ఐదు సార్లు ఛాంపియ‌న్‌గా నిలిపిన రోహిత్ శ‌ర్మ‌కు చోటు ద‌క్క‌క‌పోవడం ఫ్యాన్స్‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కాగా ఆర్సీబీ పాటిదార్ నాయ‌క‌త్వంలో బ్యాక్ టూ బ్యాక్ టైటిల్స్‌ను గెలిచిన సంగ‌తి తెలిసిందే.

రజత్ పాటిదార్ ఆల్ టైమ్ IPL XI: క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్, హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోనీ, డేల్ స్టెయిన్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, సునీల్ నరైన్.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement