చాయ్‌వాలాజ్ ఫౌండర్ రోహిత్ శర్మ ఆత్మహత్య | Chaiwalaz Founder Rohit Sharma Dies By Suicide In Rajasthan | Sakshi
Sakshi News home page

చాయ్‌వాలాజ్ ఫౌండర్ రోహిత్ శర్మ ఆత్మహత్య

Aug 2 2026 6:55 PM | Updated on Aug 2 2026 7:12 PM

Chaiwalaz Founder Rohit Sharma Dies By Suicide In Rajasthan

చాయ్‌వాలాజ్ (Chaiwalaz) వ్యవస్థాపకుడు రోహిత్ శర్మ (Rohit Sharma) మృతి చెందారు. రాజస్థాన్‌లోని దౌసాలో ఉన్న తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేవలం 30 ఏళ్ల వయస్సులోనే ఆయన మృతి చెందడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

సాకేత్ కాలనీలో నివసించే రోహిత్ శర్మ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి ఆయనను కిందకు దించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

రోహిత్ శర్మ తండ్రి హితేంద్ర మోహన్ శర్మ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆయన భార్య ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.

శర్మ సుమారు ఆరు నెలల క్రితం తన ఏడు 'చాయ్‌వాలాజ్' అవుట్‌లెట్‌లన్నింటినీ మూసివేసి, ఆధ్యాత్మికత వైపు మళ్లారు. ఆ కాలంలో ఆయన పలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ కనిపించారు. వ్యాపారాన్ని నడపడంతో పాటు, శర్మ దౌసాలో సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాలుపంచుకునేవారు.

చిన్న వయస్సులోనే పెద్ద కలలు కన్న రోహిత్ శర్మ, కేవలం 17 ఏళ్లకే తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. నర్సింగ్ చదువుతూనే జైపూర్‌లో ‘చాయ్‌వాలాజ్’ అనే టీ స్టార్టప్‌ను ప్రారంభించారు. మొదట మానసరోవర్‌లోని షిప్రా పాత్ ప్రాంతంలో తన తొలి టీ కేఫ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ లభించిన ఆదరణతో వ్యాపారాన్ని క్రమంగా విస్తరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement