breaking news
China Masters
-
చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు
-
సాత్విక్-చిరాగ్ జోడీకి వైఎస్ జగన్ అభినందనలు
చైనా మాస్టర్స్ సూపర్-750 టైటిల్ నెగ్గిన భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ రెడ్డి-చిరాగ్ శెట్టికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. "చైనా మాస్టర్స్ సూపర్ 750 టైటిల్ నెగ్గిన తొలి ఇండియన్స్‌గా నిలిచినందుకు మీకు అభినందనలు. మీ కమ్‌బ్యాక్ నిజంగా ఒక అద్భుతం. మీ పట్టుదల, దృడ సంకల్పం, పోరాట స్ఫూర్తి యావత్ దేశానికి గర్వకారణం. రాబోయే సంవత్సరాల్లోనూ మీ జోడీ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని కోరుకుంటున్నా" అని పేర్కొన్నారు.Heartiest congratulations to Satwiksairaj Rankireddy and Chirag Shetty on becoming the first Indians to win the China Masters Super 750 title with a spectacular comeback. Your grit, resilience, and fighting spirit have made the entire nation proud. Wishing you both many more… pic.twitter.com/Rm9Ia0Vzew— YS Jagan Mohan Reddy (@ysjagan) September 7, 2026ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 11-21, 21-13, 21-17తో హెజి టింగ్-రెన్ గ్జియాంగ్ జోడీపై విజయం సాధించింది. చైనా గోడను బద్దలుకొట్టిన ఈ జోడికి ఇదే తొలి చైనా మాస్టర్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో వరుసగా రెండుసార్లు (2023, 2025లో) రన్నరప్‌గా నిలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ మూడో దఫాలో మాత్రం చాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది సాత్విక్, చిరాగ్ జోడీకి ఇది రెండో టైటిల్ కాగా, ఇటీవలే సింగపూర్ ఓపెన్ సూపర్-750 టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలోనూ ఈ జంట ఫైనల్‌కు చేరింది.Read: సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర.. చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా! -
సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర.. చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా!
భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 11-21, 21-13, 21-17తో హెజి టింగ్-రెన్ గ్జియాంగ్ జోడీపై విజయం సాధించింది. చైనా గోడను బద్దలుకొట్టిన ఈ జోడికి ఇదే తొలి చైనా మాస్టర్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో వరుసగా రెండుసార్లు (2023, 2025లో) రన్నరప్‌గా నిలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ మూడో దఫాలో మాత్రం చాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది సాత్విక్, చిరాగ్ జోడీకి ఇది రెండో టైటిల్ కాగా, ఇటీవలే సింగపూర్ ఓపెన్ సూపర్-750 టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలోనూ ఈ జంట ఫైనల్‌కు చేరింది.మ్యాచ్ జరిగింది ఇలా..మ్యాచ్ ఆరంభం నుంచి మంచి ఈజ్‌తో కనిపించినప్పటికీ సాత్విక్-చిరాగ్ ద్వయం తొలి గేమ్‌ను కోల్పోయారు. అయితే రెండో గేమ్‌లో మాత్ర ఫుంజుకున్న ఈ జంట 21-13తో చైనా జోడికి చెక్ పెట్టారు. ఇక కీలకమైన మూడో గేమ్‌లో మాత్రం మొదట తడబడడంతో ఈసారి కూడా రన్నరప్‌కే పరిమితమవుతారేమోననిపించింది. ఒక దశలో 11-9తో వెనుకబడిన సాత్విక్ జంట విజృంభించి 16-16తో స్కోరును సమం చేసింది. ఈ దశలో ఒక్కసారిగా చెలరేగిపోయిన సాత్విక్, చిరాగ్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా 21-17తో గేమ్‌ను ముగించడంతో పాటు మ్యాచ్‌ను గెలిచారు. 2023, 2025 సీజన్లలో ఫైనల్‌కు చేరినప్పటికీ రన్నరప్‌కే పరిమితమైన సాత్విక్, చిరాగ్ ద్వయం ఈసారి మాత్రం టైటిల్ గెలుపే లక్ష్యంగా ఆటను కొనసాగించారు. ఇన్నాళ్లు చైనా ఫోబియాను ఎదుర్కొన్న ఈ జంట అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ చాంపియన్స్‌గా నిలిచారు.WATCH SATWIK & CHIRAG WINNING THE CHINA MASTERS 2026 TITLE! 🏆🤩- Second BWF Super 750 Title for duo! 🇮🇳BEAT CHINA AT HOME IN THE FINAL! 🔥🔥🔥 pic.twitter.com/ZCEdec0mLR https://t.co/CWOqWu1y7f— The Khel India (@TheKhelIndia) September 6, 2026Read: కౌంటీల్లో చెలరేగుతున్నాడు; సెలెక్టర్లకు చెన్నై చిన్నోడి వార్నింగ్! -
చైనా మాస్టర్స్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ
భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్ 2026 టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రియాన్ అయూబ్–టాన్ వీ కియోంగ్ జోడీని 21-15, 18-21, 21-11తో ఓడించింది.65 నిమిషాల పాటు సాగిన పోరులో భారత జోడీ తొలి గేమ్‌ను పూర్తి ఆధిపత్యంతో గెలిచినా, రెండో గేమ్‌లో కీలక దశలో పాయింట్లు కోల్పోయింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్–చిరాగ్ పూర్తిగా పుంజుకుని, ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు.ఫైనల్లో చైనా జోడీతో పోరుఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ చైనాకు చెందిన హీ జీ టింగ్–రెన్ జియాంగ్ యు జోడీని ఎదుర్కోనుంది. చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్‌కు ఇది మూడో ఫైనల్. 2023, 2025లో వారు రన్నరప్‌గా నిలిచారు. కాబట్టి ఈసారి టైటిల్ సాధిస్తే వారి తొలి చైనా మాస్టర్స్ టైటిల్ అవుతుంది.చదవండి: గంజాయి వాసన వస్తుందని మ్యాచ్‌ను ఆపిన సబలెంకా -
సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ
షెన్జెన్: ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన పోరులో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి పైచేయి సాధించింది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 16–21, 21–18తో కిమ్ అస్ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్ముసెన్ (డెన్మార్క్) జంటను ఓడించింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో భారత జంట జోరు కనబర్చగా... రెండో గేమ్‌లో డెన్మార్క్ జోడీ పుంజుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో భారత జంట 5–9తో, 15–17తో వెనుకబడింది. కానీ భారత జోడీ ఒక్కసారిగా చెలరేగి వరుసగా 5 పాయింట్లు గెలిచి 20–17తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత డెన్మార్క్ జంటకు ఒక పాయింట్ కోల్పోయిన సాత్విక్–చిరాగ్ వెంటనే మరో పాయింట్ గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సీజన్లో సాత్విక్–చిరాగ్ ద్వయం మూడో టోర్నీలో సెమీఫైనల్ చేరుకుంది. థాయ్‌లాండ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్–చిరాగ్... సింగపూర్ ఓపెన్‌లో టైటిల్ సాధించారు. నేడు జరిగే సెమీఫైనల్లో అజ్రియాన్–టాన్ వీ కియోంగ్ (మలేసియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత సీనియర్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. లీ చెయుక్ యియు (హాంకాంగ్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 16–21, 16–21తో ఓడిపోయాడు. -
శ్రీకాంత్ అద్భుత విజయం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ అద్భుత విజయం సాధించాడు. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకువెళ్లాడు. షెన్జెన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ విక్టర్ లాయ్ (కెనడా)కు శ్రీకాంత్ ఊహించని షాకిచ్చాడు.నలభై మూడు నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో విక్టర్‌ను 21-18, 21-19 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. తద్వారా బీడబ్ల్యూఎఫ్ సూపర్ 750 లేదా అంతకంటే హయ్యర్ ఈవెంట్లో దాదాపు 1175 రోజుల తర్వాత శ్రీకాంత్ తొలిసారి క్వార్టర్స్‌లో ఆడే ఘనత సాధించాడు. కాగా శ్రీకాంత్ చివరగా 2023 ఇండోనేషియా ఓపెన్ (సూపర్ 1000 ఈవెంట్)లో క్వార్టర్ ఫైనల్ చేరాడు.ఇక చైనా మాస్టర్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో 33 ఏళ్ల కిడాంబి శ్రీకాంత్ హాంగ్‌కాంగ్‌కు చెందిన లీ చుయెక్ యీయూను శుక్రవారం ఎదుర్కొంటాడు. కాగా ఒకప్పటి ప్రపంచ నంబర్ వన్ శ్రీకాంత్ ప్రస్తుతం 34వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.OH YES, KIDAMBI UPSET WORLD NO.9 🤯 🤩India's Kidambi Srikanth stuns World No. 9 Victor Lai 🇨🇦 in straight sets 21-18 21-19 Storms into the Quarterfinal of China Masters (S750)🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/848upvStfW https://t.co/qxC9Bpmao2— The Khel India (@TheKhelIndia) September 3, 2026ఇదిలా ఉంటే.. మెన్స్ డబుల్స్ ఈవెంట్లో భారత జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. గురువారం నాటి మ్యాచ్‌లో ఫ్రెంచ్ సోదరులు క్రిస్టో, టోమా జూనియర్ పొపోవ్లపై 21-15, 22-24, 21-9 తేడాతో వీరు విజయం సాధించారు. మరోవైపు.. మహిళల సింగిల్స్ విభాగంలో తన్వీ శర్మ 66 నిమిషాల పాటు జపాన్ వరల్డ్ నంబర్ 9 తొమొక మియాజాకితో పోరాడి (17-21, 21-18, 16-21) ఓటమిపాలైంది. ఇక మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల- తనీషా క్రాస్టో కూడా ఓటమిపాలయ్యారు. చైనీస్ తైపీ జోడీ చేతిలో ఓడి ఇంటిబాటపట్టారు. -
శ్రీకాంత్ శుభారంభం
షెన్జెన్: చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్‌కు నిరాశ ఎదురుకాగా... ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ విక్టర్ లాయ్ (కెనడా)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 13వ ర్యాంకర్ లక్ష్య సేన్ 14–21, 7–21తో ఓడిపోయాడు. ఇటీవల భారత్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు చేరిన విక్టర్ లాయ్ చేతిలో లక్ష్య సేన్ పరాజయం పొందడం ఇది మూడోసారి. మరోవైపు ప్రపంచ 34వ ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 21వ ర్యాంకర్ చి యు జెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 35 నిమిషాల్లో 21–16, 21–15తో గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో తన్వీ శర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... దేవిక సిహాగ్ ఇంటిదారి పట్టింది. తొలి రౌండ్లో తన్వీ శర్మ 21–16, 21–17తో అమేలియా షుల్జ్ (డెన్మార్క్)పై నెగ్గగా... దేవిక 18–21, 15–21తో కలోయానా నల్బంతోవా (బల్గేరియా) చేతిలో ఓడిపోయింది. సాత్విక్–చిరాగ్ జోడీ ముందంజ పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ గెలుపు బోణీ కొట్టింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–11, 21–16తో జునైది ఆరిఫ్–కాంగ్ ఖాయ్ జింగ్ (మలేసియా) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 16–21, 18–21తో వు గువాన్ జు–లీ చియా సిన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–8, 21–9తో టాన్‌రుగ్ సహెంగ్–టాన్కిడ్ సహెంగ్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. -
రన్నరప్ సాత్విక్–చిరాగ్ జోడీ
షెన్జెన్: ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి మరోసారి నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. 45 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 19–21, 15–21తో ప్రపంచ నంబర్‌వన్ జంట కిమ్ వన్ హో–సియో సెయంగ్ జే (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన సాత్విక్–చిరాగ్‌లకు 43,750 (రూ. 38 లక్షల 54 వేలు) డాలర్ల ప్రైజ్‌మనీతోపాటు 9350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్లో తొలి గేమ్‌లో 14–7తో ఆధిక్యంలో నిలిచిన భారత జంట దానిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది.ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరిన సాత్విక్–చిరాగ్ తుది పోరులో మాత్రం వరుస గేముల్లో ఓటమి పాలయ్యారు. గతవారం హాంకాంగ్ ఓపెన్ టోర్నీలోనూ రన్నరప్‌గా నిలిచిన సాత్విక్–చిరాగ్... అంతకుముందు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెల్చుకుంది. సింగిల్స్ విజేత ఆన్ సె యంగ్ ఈ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్, దక్షిణ కొరియా స్టార్ ఆన్ సె యంగ్ మరో టైటిల్ గెలిచింది. చైనా మాస్టర్స్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆన్ సె యంగ్ 21–11, 21–3తో ప్రపంచ మూడో ర్యాంకర్ హాన్ యువె (చైనా)పై గెలిచింది. ఈ ఏడాది ఆన్ సె యంగ్ ఖాతాలో ఇది ఏడో టైటిల్ కావడం విశేషం. -
చైనా మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
షెన్జెన్ (చైనా): భారత అగ్రశ్రేణి జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి వరుసగా రెండో టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సాత్విక్–చిరాగ్ ద్వయం టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ భారత జోడీ వరుస సెట్లలో మాజీ ప్రపంచ చాంపియన్స్, రెండో సీడ్ ఆరోన్ చియా–సో వూ యిక్ (మలేసియా) జంటపై అద్భుత విజయం సాధించింది. సాత్విక్–చిరాగ్ ద్వయం 21–17, 21–14తో మలేసియన్ ప్రత్యర్థి జంటను ఓడించింది. రెండుసార్లు ఒలింపిక్ పతకాలు నెగ్గిన ప్రత్యర్థి జంట ఈ సెమీస్ మ్యాచ్‌కు ముందు భారత ద్వయంపై 11–4 తేడాతో ఆధిపత్యంలో ఉంది. అలాంటి జోడీపై సాత్విక్–చిరాగ్‌లు ఈ సెమీస్‌లో మాత్రం చెలరేగారు. కేవలం 41 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించి విజయం సాధించారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో హాంకాంగ్ ఓపెన్ బరిలోకి దిగిన భారత జంట రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో టైటిల్‌పై కన్నేసింది. నేడు జరిగే ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ టాప్ సీడ్ కిమ్ వోన్ హో–సియో సియంగ్ జే జంటతో తలపడుతుంది. -
సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ
షెన్జెన్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ ఆ దిశగా మరో అడుగు వేసింది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 21–14, 21–14తో రెన్ జియాంగ్ యు–జియె హావోనన్ (చైనా) జోడీపై విజయం సాధించింది. 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ భారత జోడీ ఆధిపత్యం కనబరిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)తో సాత్విక్–చిరాగ్ జంట తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సాత్విక్–చిరాగ్ ద్వయం 4–11తో వెనుకంజలో ఉంది. సింధు ఎనిమిదో‘సారీ’ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు 14–21, 13–21తో పరాజయం పాలైంది. ఆన్ సె యంగ్‌తో ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదిసార్లూ సింధు ఓడిపోవడం గమనార్హం. ఈ కొరియా స్టార్‌తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో సింధు ఒక్క గేమ్ మాత్రమే గెలవగలిగింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధుకు 6,875 డాలర్ల (రూ. 6 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 6050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సింధు సంచలనం
షెన్జెన్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు... చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు సంచలన విజయం నమోదు చేసింది. ప్రపంచ ఆరో ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 21–15, 21–15తో గెలుపొందింది. 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు రెండో గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. తొలి గేమ్ ఆరంభంలో తొలి పాయింట్ చేజార్చుకున్న సింధు ఆ తర్వాత వరుసగా ఆరు పాయింట్లు సాధించి 6–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. స్కోరు 6–4 వద్ద సింధు మళ్లీ చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 11–4తో ముందంజ వేసింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి గేమ్ దక్కించుకుంది. రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. పలుమార్లు ఇద్దరి స్కోరు సమమయ్యాయి. స్కోరు 13–13 వద్ద సింధు విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 18–13తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో చోచువోంగ్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 7–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో సింధు తలపడుతుంది. ఆన్ సె యంగ్‌తో ఇప్పటి వరకు ఏడుసార్లు ఆడిన సింధు ఒక్కసారి కూడా నెగ్గలేదు. ఆన్ సె యంగ్‌తో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో సింధు ఒక్క గేమ్ మాత్రమే గెలవగలిగింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–12తో సియాంగ్ చియె చియు–వాంగ్ చి లిన్ (చైనీస్ తైపీ) జంటపై గెలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో రెన్ జియాంగ్ యు–జియె హావోనన్ (చైనా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. -
27 నిమిషాల్లోనే...
షెన్జెన్: చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21–5, 21–10తో ప్రపంచ 44వ ర్యాంకర్ జూలీ దవాల్ జేకబ్సన్ (డెన్మార్క్)పై గెలిచింది. కేవలం 27 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు ఏ దశలోనూ ప్రత్యర్థి నుంచి ఇబ్బంది ఎదురుకాలేదు. తొలి గేమ్ ఆరంభంలో సింధు చెలరేగి వరుసగా 12 పాయింట్లు నెగ్గడం విశేషం. ఈ గెలుపుతో ఈ సీజన్లో స్విస్ ఓపెన్ తొలి రౌండ్లో జూలీ చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 6–5తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టికి నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో ఆయుశ్ 19–21, 21–12, 16–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ చౌ టియెన్ చౌ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 17–21, 11–21తో యుచి షిమోగామి–సయాక హొబారా (జపాన్) జంట చేతిలో పరాజయం పాలైంది. కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో... గతవారం హాంకాంగ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఆయుశ్ మంగళవారం విడుదలైన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. నాలుగు స్థానాలు ఎగబాకిన ఆయుశ్ 27వ ర్యాంక్‌లో నిలిచాడు. హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన లక్ష్య సేన్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని 17వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. -
సెమీస్‌లో ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీ
షెన్జెన్ (చైనా): భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలకు చైనా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెమీఫైనల్లో చుక్కెదురైంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన ఈ టోర్నీలో నిలకడైన ఆటతీరు కనబరిచిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ భారత ద్వయానికి అనూహ్యంగా అన్‌సీడెడ్ కొరియన్ జంట చేతిలో ఓటమి ఎదురైంది. సాత్విక్–చిరాగ్ జోడీ 18–21, 21–14, 16–21తో జిన్ యంగ్–సియో సంగ్ జె (కొరియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. గంటా 14 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత ద్వయం పైచేయి సాధించినా... కీలకదశలో వరుసగా పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. తొలి గేమ్‌లో 11–10తో, తర్వాత 15–12తో ఆధిక్యం కనబరిచిన సాతి్వక్–చిరాగ్‌లు తర్వాత వెనుకబడి గేమ్‌ను కోల్పోయారు. కానీ రెండో గేమ్‌లో అద్భుతంగా ఆడి ప్రత్యర్థుల్ని ఓడించినప్పటికీ నిర్ణాయక మూడో గేమ్‌లో కొరియన్ జోరు ముందు నిలువలేకపోయారు. గత సీజన్ చైనా మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ డబుల్స్ జోడీ ఫైనల్ చేరి రన్నరప్‌తో తృప్తి పడగా... ఈ సారి సెమీస్‌లోనే కంగుతింది. -
సాత్విక్–చిరాగ్ జోడీ సంచలనం
షెన్జెన్: పారిస్ ఒలింపిక్స్ తర్వాత పాల్గొంటున్న తొలి టోర్నమెంట్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ అదరగొడుతోంది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం కిమ్ అస్ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్‌ముసేన్ (డెన్మార్క్)తో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–16, 21–19తో గెలిచింది.47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ తొలి గేమ్‌లో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. ఒక్కసారి కూడా స్కోరును సమం కానివ్వలేదు. రెండో గేమ్‌లో మాత్రం గట్టిపోటీనే లభించింది. డెన్మార్క్ జంట తీవ్రంగా పోరాడటంతో పలుమార్లు స్కోరు సమమైంది. చివర్లో స్కోరు 19–19 వద్ద సమంగా ఉన్నపుడు భారత జోడీ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. గత ఏడాది ఇదే టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ నేడు జరిగే సెమీఫైనల్లో జిన్ యోంగ్–జే సియో సెయింగ్ (దక్షిణ కొరియా) జోడీతో తలపడుతుంది. గతంలో కిమ్ అస్ట్రుప్–స్కారప్లతో తొమ్మిదిసార్లు తలపడి, ఆరుసార్లు ఓడిపోయిన భారత జంట ఈ ఏడాది డెన్మార్క్ ద్వయంపై రెండోసారి గెలిచింది. ఇండియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోనూ డెన్మార్క్ జోడీనే సాత్విక్–చిరాగ్ ద్వయం ఓడించింది. పోరాడి ఓడిన లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్‌కు నిరాశ ఎదురైంది. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సన్ (డెన్మార్క్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 18–21, 15–21తో ఓడిపోయాడు. 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌లో మూడుసార్లు ఆధిక్యంలోకి వెళ్లి దానిని వృథా చేసుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం ఆంటోన్సన్దే పైచేయిగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఓడిపోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న లక్ష్య సేన్... విశ్వ క్రీడల తర్వాత ఆడిన నాలుగు టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్‌ను దాటి ముందుకెళ్లలేకపోయాడు. -
సాత్విక్–చిరాగ్ జోడీ జోరు
షెన్జెన్: పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడుతున్న తొలి టోర్నమెంట్ చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ జోడీగా ఈ టోర్నీలో ఆడుతున్న సాత్విక్–చిరాగ్ ద్వయం కష్టపడి గెలిచి ముందంజ వేసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 9వ ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 21–19, 21–15తో ప్రపంచ 15వ ర్యాంక్ ద్వయం రస్ముస్ జార్–ఫ్రెడెరిక్ సొగార్డ్ (డెన్మార్క్)పై గెలిచింది. 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీకి గట్టిపోటీనే ఎదురైంది. తొలి గేమ్ చివర్లో సాత్విక్–చిరాగ్ పైచేయి సాధించారు. రెండో గేమ్‌లో స్కోరు 13–12 వద్ద భారత జంట వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 17–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో రెండో గేమ్నూ సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ కిమ్ అస్ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్‌ముసేన్ (డెన్మార్క్)తో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో భారత జంట 3–6తో వెనుకబడి ఉండటం గమనార్హం. లక్ష్య సేన్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. రస్ముస్ గెమ్కే (డెన్మార్క్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–16, 21–18తో అలవోకగా గెలిచాడు. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌లో దూకుడుగా ఆడాడు. 13–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత రస్ముస్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి ఆధిక్యాన్ని 13–10కి తగ్గించాడు. ఈ దశలో లక్ష్య సేన్ నిలకడగా రాణించి తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో లక్ష్య సేన్‌కు గట్టిపోటీ ఎదురైంది. పలుమార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. అయితే కీలకదశలో లక్ష్య సేన్ పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడుతున్న నాలుగో టోరీ్నలో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం గమనార్హం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 3వ ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సన్ (డెన్మార్క్)తో లక్ష్య సేన్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో లక్ష్య సేన్ 2–4తో వెనుకంజలో ఉన్నాడు. ముగ్గురికీ నిరాశ మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. భారత స్టార్ పీవీ సింధు, రైజింగ్ స్టార్స్ మాళవిక బన్సోద్, అనుపమ ఉపాధ్యాయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. ప్రపంచ 19వ ర్యాంకర్ సింధు 16–21, 21–17, 21–23తో యో జియా మిన్ (సింగపూర్) చేతిలో పరాజయం చవిచూసింది. గతంలో జియా మిన్తో ఆడిన ఐదుసార్లూ నెగ్గిన సింధుకు ఆరోసారి మాత్రం చుక్కెదురైంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒకదశలో 13–9తో ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో జియో మిన్ వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 15–13తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు జియా మిన్ కొట్టిన బాడీ స్మాష్‌కు సింధు జవాబివ్వలేకపోవడంతో ఆమె ఓటమి ఖరారైంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మాళవిక 9–21, 9–21తో సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో, అనుపమ 7–21, 14–21తో నత్సుకి నిదైరా (జపాన్) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 16–21, 11–21తో రెండో సీడ్ లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. మిక్స్డ్ డబుల్స్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) జోడీకి సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జంట ‘వాకోవర్’ ఇచ్చింది. -
పోరాడి ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీ
షెన్జెన్ (చైనా): ఈ ఏడాది ఆరో టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. 71 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 19–21, 21–18, 19–21తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. విజేతగా నిలిచిన లియాంగ్–వాంగ్ చాంగ్‌లకు 85,100 డాలర్ల (రూ.70 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీ, 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సాత్విక్–చిరాగ్‌లకు 40,250 డాలర్ల (రూ. 33 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీ, 9350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ ఇండోనేసియా ఓపెన్, కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్లలో టైటిల్స్ సాధించడంతోపాటు ఆసియా చాంపియన్íÙప్లో, హాంగ్జౌ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచింది. -
శ్రీకాంత్ పరాజయం
షెన్జెన్: చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్‌లకు నిరాశ ఎదురైంది. ఈ ముగ్గురూ తొలి రౌండ్‌ను దాటలేకపోయారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 15–21, 21–14, 13–21తో ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 19–21, 18–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ షి యు కి (చైనా) చేతిలో... 30వ ర్యాంకర్ ప్రియాన్షు 17–21, 14–21తో 13వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రితూపర్ణ–శ్వేతపర్ణ (భారత్) ద్వయం 15–21, 9–21తో షు జియాన్ జాంగ్–యు జెంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్
షెన్జెన్: చైనా మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ప్రణయ్ 21–18, 22–20తో ప్రపంచ 12వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. ఈ ఏడాది వీరిద్దరు నాలుగుసార్లు ముఖాముఖిగా తలపడగా... రెండు సార్లు ప్రణయ్, రెండుసార్లు చౌ తియెన్ గెలిచారు. మరోవైపు మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆకర్షి కశ్యప్ (భారత్) 12–21, 14–21తో జాంగ్ యి మన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–10తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్) జంటపై గెలిచింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)తో శ్రీకాంత్; షి యు కి (చైనా)తో లక్ష్య సేన్; కెంటా నిషిమోటో (జపాన్)తో ప్రియాన్షు రజావత్ తలపడతారు. -
ముగిసిన భారత్ పోరు
జియాంగ్సు (చైనా):చైనా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ పోరు ముగిసింది. మహిళల సింగిల్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 17-21, 19-21 తేడాతో బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలైంది. 38 నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు పోరాడి ఓడింది. తొలి గేమ్ లో ఆదిలో సింధు 4-1 తో ఆధిక్యంలోకి వెళ్లినా.. ఆ తరువాత థాయ్ లాండ్ క్రీడాకారిణి స్కోరును 4-4 తో సమం చేసింది. ఆపై సింధు 7-4, 13-10 తో మరోసారి ముందుకు దూసుకెళ్లింది. కాగా, తొలి గేమ్ స్కోరు 16-16తో ఇరువురి క్రీడాకారిణులు సమంగా ఉన్న సమయంలో బురానాప్రాసెర్ట్సుక్ వరుస పాయింట్లను సాధించి గేమ్ ను దక్కించుకుంది. అయితే రెండో గేమ్ లో సింధు 11-8తేడాతో పైచేయి సాధించినా మధ్యలో చతికిలబడి వరుస పాయింట్లను చేజార్చుకుంది. రెండో గేమ్ ఆద్యంతం నువ్వా-నేనా అన్నట్లు సాగినా చివరకు బురానాప్రాసెర్ట్సుక్నే విజయం వరించింది. ఇదిలా ఉండగా పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత క్రీడాకారుడు హెచ్ ఎస్ ప్రణయ్ 10-21, 15-21 తేడాతో ప్రపంచ నంబర్ వన్ చెన్ లాంగ్(చైనా)చేతిలో ఓటమి పాలయ్యాడు. ఏ దశలోనూ ఆకట్టుకోని ప్రణయ్ ఓటమి పాలై టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించాడు. మహిళల డబుల్స్‌లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో గుత్తా జ్వాలా-అశ్విని పొన్నప్ప జోడి 11-21, 14-21 తేడాతో లూ యింగ్-వూ యూ(చైనా) చేతిలో పరాజయం చెందారు.


