పోరాడి ఓడిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

Satwik and Chirag pair lost the fight - Sakshi

చైనా మాస్టర్స్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత ద్వయం

షెన్‌జెన్‌ (చైనా): ఈ ఏడాది ఆరో టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టికి నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన చైనా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. 71 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్‌ జంట సాత్విక్‌–చిరాగ్‌ 19–21, 21–18, 19–21తో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో ఉన్న లియాంగ్‌ వె కెంగ్‌–వాంగ్‌ చాంగ్‌ (చైనా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది.

విజేతగా నిలిచిన లియాంగ్‌–వాంగ్‌ చాంగ్‌లకు 85,100 డాలర్ల (రూ.70 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీ, 11 వేల ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ సాత్విక్‌–చిరాగ్‌లకు 40,250 డాలర్ల (రూ. 33 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీ, 9350 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సాత్విక్‌–చిరాగ్‌ ఇండోనేసియా ఓపెన్, కొరియా ఓపెన్, స్విస్‌ ఓపెన్‌లలో టైటిల్స్‌ సాధించడంతోపాటు ఆసియా చాంపియన్‌íÙప్‌లో, హాంగ్జౌ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top