ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్‌ | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్‌

Published Wed, Nov 22 2023 3:58 AM

Pranay in prequarters - Sakshi

షెన్‌జెన్‌: చైనా మాస్టర్స్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ –750 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ ప్రణయ్‌ 21–18, 22–20తో ప్రపంచ 12వ ర్యాంకర్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)పై గెలుపొందాడు.

ఈ ఏడాది వీరిద్దరు నాలుగుసార్లు ముఖాముఖిగా తలపడగా... రెండు సార్లు ప్రణయ్, రెండుసార్లు చౌ తియెన్‌ గెలిచారు. మరోవైపు మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఆకర్షి కశ్యప్‌ (భారత్‌) 12–21, 14–21తో జాంగ్‌ యి మన్‌ (చైనా) చేతిలో ఓడిపోయింది.

పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–13, 21–10తో బెన్‌ లేన్‌–సీన్‌ వెండీ (ఇంగ్లండ్‌) జంటపై గెలిచింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ప్రపంచ చాంపియన్‌ కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌)తో శ్రీకాంత్‌; షి యు కి (చైనా)తో లక్ష్య సేన్‌; కెంటా నిషిమోటో (జపాన్‌)తో ప్రియాన్షు రజావత్‌ తలపడతారు.

Advertisement
 
Advertisement
 
Advertisement