టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెడ్ బాల్ క్రికెట్‌లోనూ సత్తాచాటుతున్నాడు. సెంట్రల్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో ఈస్ట్‌జోన్ తరపున సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 132 పరుగులు చేసి తన జట్టు ఫైనల్‌కు చేరడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అయితే టీ20ను తలపిస్తూ బ్యాటింగ్ చేశాడు. ఓ దశలో తన ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్‌ను సునాయసంగా అందుకునేలా కనిపించిన సూర్యవంశీ.. 92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. ఇప్పుడు సెప్టెంబర్ 6 నుంచి సౌత్‌జోన్‌తో ప్రారంభం కానున్న ఫైనల్ మ్యాచ్‌కు సూర్యవంశీ సన్నదమవుతున్నాడు.
ఈ నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్‌పై భారత మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ ఒక అద్భుతమని, అతడి కారణంగానే తన భార్య దులీప్ ట్రోఫీని చూస్తుందని శ్రీకాంత్ వెల్లడించాడు.
వైభవ్ ప్రస్తుతం మంచి రిథమ్‌లో ఉన్నాడు. అతడిని ప్రోత్సహించాలి గానీ, ఎప్పుడూ నిరుత్సాహపరచకూడదు. సరైన మార్గంలో నడిపిస్తే భవిష్యత్తులో అతడు కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు. టెస్ట్ క్రికెట్‌కు పూర్వ వైభవం తెచ్చే సత్తా వైభవ్‌కు ఉంది. అతడి ఆట తీరు వల్లే అందరూ ఇప్పుడు దులీప్ ట్రోఫీని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
ఆఖరికి మా భార్య కూడా వైభవ్‌కు పెద్ద అభిమానిగా మారిపోయింది. కేవలం అతడి బ్యాటింగ్ చూడడం కోసమే ఆమె దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లను వీక్షిస్తోంది" అని చిక్కా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ బిహార్ క్రికెటర్ ఇప్పటికే వరల్డ్ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. అటు అండర్-19 నుంచి ఇటు అంతర్జాతీయ క్రికెట్ వరకు ఎన్నో అద్భుత రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!


