టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి జాతీయ టీ20 జట్టులోకి వచ్చాడు. జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న శాంసన్‌ను.. అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. దీంతో అఫ్గాన్ సిరీస్‌లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.
జింబాబ్వే టూర్‌లో శాంసన్ లేకపోవడంతో భారత ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ప్రారంభించారు. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలో సంజూ విఫలం కావడంతో సూర్యవంశీకి ఓపెనర్‌గా అవకాశమిచ్చారు. కానీ సంజూ స్ధానంలో జట్టులోకి వచ్చిన వైభవ్ కూడా తీవ్ర నిరాశపరిచాడు.
దీంతో ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20కు వైభవ్‌ను తప్పించి శాంసన్‌ను మళ్లీ తుది జట్టులోకి తీసుకొచ్చారు. ఆ మ్యాచ్‌లో శాంసన్ 27 పరుగులు సాధించి జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చాడు. అయినప్పటికి ఆ తర్వాత జింబాబ్వే టీ20 సిరీస్‌కు అతడిని పక్కన పెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది.
టీ20 ప్రపంచకప్ హీరోని జట్టు నుంచి తప్పిస్తారా? అని సెలక్టర్లపై చాలా మంది మాజీలు మండిపడ్డారు. అయితే అతడిని జట్టు నుంచి తప్పించలేదని, కేవలం విశ్రాంతి మాత్రమే ఇచ్చారని బీసీసీఐ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. ఇప్పుడు మళ్లీ సంజూ టీ20 జట్టులోకి వచ్చాడు.
ఈ క్రమంలో సంజూ రాకతో వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్ తగిలే అవకాశముంది. ఎప్పటిలాగే భారత ఇన్నింగ్స్‌ను సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే 15 ఏళ్ల సూర్యవంశీ బెంచ్‌కు పరిమితం కావాల్సిందే. ఒకవేళ శాంసన్ విఫలమైతేనే వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఈస్ట్‌జోన్ జట్టుకు సూర్యవంశీ ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్‌తో సిరీస్ ప్రారంభం కానుండటంతో, తొలి మ్యాచ్ ఎంపికకు అతడు అందుబాటులో ఉండటం అనుమానంగానే మారింది.
చదవండి: అతడు జట్టులో ఎందుకు? ముగ్గురిలో.. ఇద్దరు ఫిట్‌గా లేరు.. గ్రేట్!


