source: BCCI X
మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా నిన్న జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో 6 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 12 పరుగులు చేసిన ఆమె.. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు (2182 బంతులు) పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచింది. ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలిస్సా హీలీ పేరిట ఉండేది.
22 ఏళ్ల 220 రోజుల వయసులో 3000 టీ20 పరుగులు పూర్తి చేసిన షఫాలీ, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా కూడా రికార్డు సృష్టించింది. పై రెండు ప్రపంచ రికార్డులే.
2019లో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన షఫాలీ, 3000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత మహిళా క్రికెటర్‌గానూ నిలిచింది. ఆమెకు ముందు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన ఈ ఘనత సాధించారు.
భారత్ ఘన విజయం
దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా పాక్‌ను 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ ఛేదించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి అజేయంగా సెమీఫైనల్‌కు చేరింది.
చెలరేగిన స్పిన్నర్లు
ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు శ్రీచరణి (4-0-7-3), ప్రేమా రావత్ (4-0-9-3), దీప్తి శర్మ (3.1-0-5-2), షఫాలీ వర్మ (3-0-10-1) చెలరేగిపోయారు.
చదవండి: శ్రీ చరణి ప్రపంచ రికార్డు.. 55 పరుగులకే పాక్ ఆలౌట్


