లండన్: ప్రతిష్టాత్మక లండన్ స్క్వాష్ క్లాసిక్ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్ అనాహత్ సింగ్ పోరాటం ముగిసింది. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) గోల్డ్ ఈవెంట్‌లో భాగంగా శనివారం మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ అనాహత్ 4–11, 4–11తో ఐదో ర్యాంకర్ శివసంగరి సుబ్రమణ్యం (మలేసియా) చేతిలో ఓడింది. ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ను చిత్తుచేసిన 18 ఏళ్ల అనాహత్ క్వార్టర్స్‌లో అదే జోరు కొనసాగించలేక టోర్నీ నుంచి నిష్క్ర మించింది. ఆసియా క్రీడలకు ముందు ఈ నెల 12 నుంచి ఖతార్ క్లాసిక్ టోర్నీలో అనాహత్ బరిలోకి దిగనుంది.


