Photo Credit: BCCI Twitter
దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ జట్టు తరఫున ఆడుతున్న 31 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో చాలా సీనియర్ ఆటగాడు. 2019 దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ బాది వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత ఇండియా-ఏ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ ఇండియా-ఏ తరఫున మాత్రం పెద్దగా రాణించలేదు.
దేశవాళీ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా 2021 జనవరిలో అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ తుది జట్టులో మాత్రం స్థానం లభించలేదు. అలా 2021 నుంచి 2026 దాకా టెస్టుల్లో అరంగేట్రం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే వస్తున్నాడు అభిమన్యు ఈశ్వరన్.
ఇక్కడ మరో విచిత్రమైన విషయమేంటంటే.. అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన 2021 నుంచి అతడి కళ్ల ముందే 11 మంది ఆటగాళ్లు టెస్టుల్లో అరంగేట్రం చేయడం గమనార్హం. ఒక రకంగా అభిమన్యు ఈశ్వరన్ టాలెంట్‌ను తొక్కసినట్లేననిపిస్తోంది. ఇప్పటివరకు అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 197 ఇన్నింగ్స్‌ల్లో 8,545 పరుగులు సాధించాడు. ఇందులో 38 అర్థసెంచరీలు, 27 సెంచరీలు ఉన్నాయి. అందని ద్రాక్ష పుల్లన అంటే ఇదేనేమో!
చెన్నై వేదికగా జరుగుతున్న తాజా దులీప్ ట్రోఫీ ఫైనల్లోనూ ఈస్ట్‌జోన్‌కు ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్ మరోసారి ఆకట్టుకున్నాడు. 120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు సాధించాడు. ప్రస్తుతం తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్‌జోన్ జట్టు 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (111 నాటౌట్), కుమార్ కుషాగ్ర (63 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
Meet Abhimanyu Easwaran 🥲
>31-year-old Abhimanyu Easwaran was born in Dehradun, Uttarakhand.
>At the age of 10, he moved to Kolkata and started his cricket journey.
>In the 2019 Duleep Trophy final, he smashed a brilliant century.
>After that, he was named in the India A squad.… pic.twitter.com/ryHD2qxmTn— Sam (@cricsam02) September 6, 2026
చదవండి: సెంచరీతో ఇరగదీసిన ఇషాన్ కిషన్.. తొలిరోజు ఈస్ట్‌జోన్‌దే


