source: X
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తన కెరీర్‌లో ఓ భారీ మైలురాయిని తాకనున్నాడు. ఆదివారం సౌత్ జోన్‌తో మొదలయ్యే దులీప్ ట్రోఫీ ఫైనల్ అతడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 100వ మ్యాచ్ కానుంది. ఈ టోర్నీలో షమీ ఈస్ట్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
షమీ ఇప్పటివరకు 99 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 382 వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ 8-90గా (ఇన్నింగ్స్‌లో) ఉంది. ప్రస్తుత దులీప్ ట్రోఫీలో షమీ ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు.
ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉన్న షమీ రీఎంట్రీ కోసం చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా టీమిండియా సెలెక్టర్లు అతడిని కనికరించడం లేదు. 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కు ముందు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (అతడి రంజీ జట్టు అసోసియేషన్) షమీని సత్కరించింది.
అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంతకం చేసిన 100వ నంబర్ జెర్సీని బహుకరించింది. ఈస్ట్ జోన్ సహచరులు కూడా సంతకాలు చేసిన జెర్సీని షమీకి బహుకరించారు.
MOHAMMED SHAMI 100* 🇮🇳
- A special gift from Cricket Association of Bengal for Mohammed Shami.
Indian legend will be playing his 100th First Class matches tomorrow. pic.twitter.com/SVwDBKsL9p— Johns. (@CricCrazyJohns) September 5, 2026
షమీ తన 100వ మ్యాచ్‌పై స్పందిస్తూ, ఈ ప్రయాణం హార్డ్ వర్క్, సవాళ్లు, నేర్చుకోవడం, మరచిపోలేని జ్ఞాపకాలతో సాగిందని అన్నాడు. ఈ ప్రత్యేక మైలురాయికి తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, కోచ్‌లు, సహచరులు, అభిమానులతో పాటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.
చదవండి: పాకిస్తాన్ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన షఫాలీ.. సరికొత్త ప్రపంచ రికార్డులు


