ఏంటి వైస్ కెప్టెన్.. ఇంత స్లోగా ఆడుతున్నావ్? | Tilak Varma Sledges Vaibhav Sooryavanshi In Duleep Trophy Final | Sakshi
Sakshi News home page

ఏంటి వైస్ కెప్టెన్.. ఇంత స్లోగా ఆడుతున్నావ్?

Sep 6 2026 2:03 PM | Updated on Sep 6 2026 2:48 PM

Tilak Varma Sledges Vaibhav Sooryavanshi In Duleep Trophy Final

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలోనూ సత్తాచాటుతున్నాడు. సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు సౌత్ జోన్‌తో జరుగుతున్న తుది పోరులోనూ అదరగొట్టాడు.

టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను సైతం ఈ చిచ్చరపిడుగు వదల్లేదు. కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి సౌత్ జోన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

తిలక్ మాస్టర్ ప్లాన్‌
అయితే దూకుడుగా ఆడుతూ డేంజర్‌గా మారుతున్న వైభవ్‌ను అడ్డుకోవడానికి వైభవ్‌ను కట్టడి చేసేందుకు సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేశాడు.  వైభవ్ దగ్గరకు వెళ్లి, "ఏంటి వైస్ కెప్టెన్.. ఇంత స్లోగా ఆడుతున్నావు?" అంటూ చిన్నగా మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు.

తిలక్ విసిరిన ఈ మాటల వలలో పడ్డ వైభవ్, ఒక్కసారిగా ఏకాగ్రత కోల్పోయాడు. తర్వాతి బంతికే భారీ పుల్ షాట్‌కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో వైభవ్ ఆధిపత్యానికి తెరపడింది. తిలక్ వర్మ వేసిన ఈ మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది

తుది జట్లు
ఈస్ట్ జోన్: అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీ, కుమార్ కుషాగ్రా, సుదీప్ కుమార్ ఘరామి, శిఖర్ మోహన్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌), మ‌హ్మ‌ద్‌ కౌనైన్ ఖురైషి, అనుకుల్ రాయ్, మహమ్మద్ షమీ, అభిజిత్ కె సర్కార్, ముఖేష్ కుమార్

సౌత్ జోన్: రికీ భుయ్, నారాయణ్ జగదీషన్(వికెట్ కీప‌ర్‌), దేవదత్ పడిక్కల్, షేక్ రషీద్, తిలక్ వర్మ(కెప్టెన్‌), స్మరణ్ రవిచంద్రన్, శ్రేయస్ గోపాల్, త్రిపురాన విజయ్, మహ్మద్ సిరాజ్, చామ వి మిలింద్, మ‌హ్మ‌ద్‌ నిధీష్
చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే క‌థ మ‌రోలా ఉండేది: పాక్‌ కెప్టెన్‌

 


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement