వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. సిరాజ్‌ను సైతం వదల్లేదు | Vaibhav Sooryavanshi smashes Mohammed Siraj for a stunning 6 down the ground in Duleep Trophy | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. సిరాజ్‌ను సైతం వదల్లేదు

Sep 6 2026 11:41 AM | Updated on Sep 6 2026 12:03 PM

Vaibhav Sooryavanshi smashes Mohammed Siraj for a stunning 6 down the ground in Duleep Trophy

చెన్నై వేదిక‌గా సౌత్‌జోన్‌తో జ‌రుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైన‌ల్లో ఈస్ట్‌జోన్ యువ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ మెరుపులు మెరిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో త‌నదైన శైలిలో సూర్య‌వంశీ విరుచుకుప‌డ్డాడు. సౌత్‌జోన్‌కు ప్రాత‌నిధ్యం వ‌హిస్తున్న స్టార్ పేస‌ర్ మహ్మ‌ద్ సిరాజ్‌ను సైతం వైభ‌వ్ వ‌ద‌ల్లేదు. 

7వ ఓవర్‌ వేసిన సిరాజ్‌ బౌలింగ్‌లో వైభవ్‌ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 14 పరుగులు పిండుకున్నాడు. ఓవరాల్‌గా 37 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేశాడు. మరోసారి షార్ట్‌ లెంగ్త్‌ డెలివరీకే వైభవ్‌ తన వికెట్‌ను కోల్పోయాడు. సీవీ మిలింద్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్‌ వద్ద సూర్యవంశీ దొరికిపోయాడు.  ఇక ఈస్ట్‌జోన్ 21 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 125 పరుగులు చేసింది.

తుది జట్లు
ఈస్ట్ జోన్: అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీ, కుమార్ కుషాగ్రా, సుదీప్ కుమార్ ఘరామి, శిఖర్ మోహన్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌), మ‌హ్మ‌ద్‌ కౌనైన్ ఖురైషి, అనుకుల్ రాయ్, మహమ్మద్ షమీ, అభిజిత్ కె సర్కార్, ముఖేష్ కుమార్

సౌత్ జోన్: రికీ భుయ్, నారాయణ్ జగదీషన్(వికెట్ కీప‌ర్‌), దేవదత్ పడిక్కల్, షేక్ రషీద్, తిలక్ వర్మ(కెప్టెన్‌), స్మరణ్ రవిచంద్రన్, శ్రేయస్ గోపాల్, త్రిపురాన విజయ్, మహ్మద్ సిరాజ్, చామ వి మిలింద్, మ‌హ్మ‌ద్‌ నిధీష్
చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే క‌థ మ‌రోలా ఉండేది: పాక్‌ కెప్టెన్‌


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement