మహిళల ఆసియాకప్-2026లో భారత్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. దుబాయ్ వేదికగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 55 పరుగులకే కుప్పకూలింది.
స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమా రావత్ తలా మూడు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు దీప్తి శర్మ రెండు, షెఫాలీ వర్మ ఓ వికెట్ సాధించింది. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మునీబా అలీ(13), షవాల్ జుల్ఫికర్(14) మినహా మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి 8.4 ఓవర్లలో చేధించింది.
ఫాతిమా ఓవరాక్షన్
కాగాస్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా దాటికి టాపార్డర్ బ్యాటర్లు షెఫాలీ వర్మ (12), స్మృతి మంధాన (9), ప్రతీక రావల్ (4) పెవిలియన్ చేరారు.
అయితే షెఫాలీని ఔట్ చేసిన అనంతరం ఫాతిమా ఓవరాక్షన్ చేసింది. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సనా.. షెఫాలీకి గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించింది. ఆ బంతిని షెఫాలీ లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించింది. కానీ బంతి లీడింగ్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. దీంతో పాక్ కెప్టెన్ ఈజీ రిటర్న్ క్యాచ్ అందుకుంది. వెంటనే ఫాతిమా షెఫాలీ వైపు చేయి చూపిస్తూ "ఇక ఆడింది చాలు వెళ్లు" అన్నట్లుగా సైగలు చేస్తూ సెండాఫ్ ఇచ్చింది.
కానీ షెఫాలీ మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్‌గా మైదానం వీడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పాక్ కెప్టెన్‌కు ఎందుకంత పొగరు? అని కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇదే మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ మునీబాను షెఫాలీ క్లీన్ బౌల్డ్ చేసినప్పటికి ఎలా సెలబ్రేషన్స్ చేసుకోవడం గమనార్హం. కానీ పాక్ కెప్టెన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించింది.
Fatima Sana turning up the heat despite the scoreline. 🥵
Watch India vs Pakistan LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #DPWorldWomensAsiaCup2026 #NotAGentlemansGame pic.twitter.com/j2ohXqlZSV— Sony Sports Network (@SonySportsNetwk) September 5, 2026


