Photo Credit: Twitter
కేరళ క్రికెట్ లీగ్ 2026లో టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్‌కు ఘోర అవమానం ఎదురైనట్లు తెలుస్తోంది. శనివారం టోర్నీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రజంటేషన్ వేడుకలో శాంసన్‌తో చేతులు కలపడానికి భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నిరాకరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో నిజమెంత? ఏఐ వీడియోనా అనేది పక్కనబెడితే శ్రీశాంత్ చర్య మాత్రం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.
విషయంలోకి వెళితే.. ప్రజంటేషన్ సందర్భంగా అప్పటికే శాంసన్ వెళ్లి స్టేజీపై ట్రోఫీ పక్కనే నిల్చున్నాడు. ఈలోగా స్టేజీ మీదకు వచ్చిన శ్రీశాంత్ శాంసన్ వైపు కన్నెత్ని కూడా చూడలేదు. అటుపై శాంసన్ పక్కనే నిల్చున్న మిగతా అధికారులకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ శాంసన్‌తో షేక్ హ్యాండ్ కాదు కదా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.
వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట క్షణాల్లో వైరలయ్యాయి. అయితే దీనిపై అటు శ్రీశాంత్ కానీ.. ఇటు సంజూ కానీ ఇప్పటివరకైతే స్పందించలేదు. అయితే అభిమానులు మాత్రం కామెంట్లతో రెచ్చిపోయారు. "సంజూ శాంసన్‌ను శ్రీశాంత్ కూరలో కరివేపాకులా తీసేశాడు.. ఇది దారుణ అవమానం" అని పేర్కొన్నారు.
ఇక కేరళ క్రికెట్ లీగ్ 2026 టైటిల్‌ను త్రిసూర్ టైటాన్స్ ఎగరేసుకుపోయింది. శనివారం రాత్రి కాలికట్ గ్లోబల్‌స్టార్స్‌తో జరిగిన ఫైనల్లో త్రిసూర్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కాలికట్ గ్లోబల్‌స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అఖిల్ స్కారియా (45), అశ్విన్ ఆనంద్ (40) రాణించారు.
త్రిసూర్ బౌలర్లలో అబ్దుల్ రమీస్ 3 వికెట్లు తీయగా, ఆనంద్ జోసెఫ్, శరత్ ప్రసాద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన త్రిసూర్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అహమ్మెద్ ఇమ్రాన్ (69) అర్థసెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, సంజీవ్ సతీషన్ (29) రాణించాడు.
కాలికట్ బౌలర్లలో జోస్ పెరైల్, అఖిన్ సతార్, ఇన్బుల్ అఫ్తాబ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. మహ్మద్ అజారుద్దీన్ (11 మ్యాచ్‌ల్లో 596 పరుగులు) టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలవగా, నిఖిల్ మాలిక్ (11 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
ప్రస్తుతం సంజూ శాంసన్ భారత జట్టులో టీ20, వన్డేల్లో కొనసాగుతున్నాడు. జింబాబ్వే, ఇంగ్లండ్ సిరీస్‌కు దూరంగా ఉన్న శాంసన్ అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
Any problems between Sreesanth and Sanju Samson?👀
There seems to be some talk about a possible ego clash following Sreesanths recent interview.
Only they know whats really happening🤷♂️#SanjuSamson @BCCI pic.twitter.com/ndNri2Tabm— Morvin Edward (@morvinedward) September 6, 2026
చదవండి: 'అందని ద్రాక్ష పుల్లన'.. అతడి విషయంలో నిజమైంది!


