breaking news
handshake
-
Asia Cup 2025: ‘చేయి’ కలపలేదని...
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నిలో భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఫలితం ఏకపక్షంగా ముగిసింది. చెత్తగా ఆడిన పాకిస్తాన్ తమ ఆటతీరును విశ్లేషించు కోవాల్సిందిపోయి ఇరు జట్ల ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదనే అంశంపై వివాదాన్ని రాజేస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దీనిపైనే దృష్టి పెట్టినట్లుంది. ఫిర్యాదులు, చర్యలు చేపట్టాలంటూ తెగ హడావుడి చేస్తోంది. కానీ కరచాలనం తిరస్కరణ కొత్తదేమీ కాదు. టెన్నిస్‌లో, ఫుట్‌బాల్‌లోనూ ఉద్రిక్తతలు, రాజకీయ వైరం కారణంగా ఆయా దేశాలకు చెందిన ప్లేయర్లు ఎన్నోసార్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదు. దీనిపై టెన్నిస్ ఇంటిగ్రిటీ గానీ, ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిపా) గానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పీసీబీ మాత్రం నానా యాగీ చేస్తోంది. మ్యాచ్ రిఫరీని తొలగించండి మ్యాచ్ ముగిసిన తర్వాత తమ జట్టు ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పీసీబీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆదివారం నాటి లీగ్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన అండీ పైక్రాఫ్ట్‌ను తక్షణమే తొలగించాలని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి ఫిర్యాదు చేసింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జోక్యం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఏసీసీ చీఫ్‌గా పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ ఉంటే, ఐసీసీ చీఫ్‌గా భారత్‌కు చెందిన జై షా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఎవరెలా స్పందిస్తారోనన్నది, ఎలా ముగింపు పలుకుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. ‘మ్యాచ్ రిఫరీపై ఐసీసీకి ఫిర్యాదు చేశాం. ఐసీసీ నియమావళి, ఎంసీసీ చట్టాలు, క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ వ్యవహరించారు. దీన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే ఆయన్ని ఆసియా కప్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది’ అని ఏసీసీ చీఫ్ కూడా అయిన నఖ్వీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. టాస్ వేసే సమయంలోనే భారత కెపె్టన్ సూర్యకుమార్‌తో షేక్‌హ్యాండ్ చేయొద్దని పాక్ కెపె్టన్ సల్మాన్ అగాతో రిఫరీ పైక్రాఫ్ట్ చెప్పారని పీసీబీ పేర్కొంది. టీమ్ షీట్ల మారి్పడి సజావుగా జరగలేదని పాకిస్తన్ జట్టు మేనేజర్ నవిద్ చిమా కూడా ఏసీసీకి ఫిర్యాదు చేశారు. షీమ్ షీట్లను ఇద్దరు కెపె్టన్లు మార్చుకోవడం సహజం. కానీ ఈ సారి టీమ్ షీట్లను కెపె్టన్ల నుంచి రిఫరీ తీసుకున్నారు. తెలుసా... ఆతిథ్య హక్కులు దక్కవు!పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఆడొద్దు, ఇకపై జరగొద్దు అని భారత్‌లో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కానీ బహుళ జట్లు బరిలో ఉండే ఈవెంట్లలో తప్పుకుంటే ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు పొందే అవకాశాలు రావు. ఎందుకంటే ప్రస్తుతం క్రికెట్ ఇప్పుడు ఒలింపిక్ చార్టర్లో భాగమైంది. లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్‌లో నిర్వహణకు సిద్ధమైంది. ఇక భారత్ 2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం పోటీపడాలనుకుంటుంది. ఇలాంటి సమయంలో పాక్‌తో ఆడం, మ్యాచ్‌లను బహిష్కరిస్తామంటే ఆతిథ్య ఆశలు, అవకాశాలు అడుగంటుతాయి.గతంలో... టెన్నిస్‌లో...ఇప్పుడు ఆసియా కప్ క్రికెట్లో షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం వివాదాస్పదం చేస్తున్నారు కానీ... ఇలా జరగడం క్రీడల్లో ఇదేమీ మొదటిసారి కాదు. 2023లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నిలో ఉక్రెయిన్‌కు చెందిన స్వితోలినా, బెలారస్ ప్లేయర్ విక్టోరియా అజరెంకా మ్యాచ్ అనంతరం షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. వింబుల్డన్ నిర్వాహక కమిటీ స్వితోలినాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ అంశాన్ని అసలు పట్టించుకోనేలేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో బెలారస్ అండగా నిలవడమే ఈ వైఖరికి కారణం కాగా... ఇప్పటికీ కూడా పలువురు ఉక్రెయిన్ ప్లేయర్లతో... బెలారస్, రష్యా ప్లేయర్లు కరచాలనం చేయడం లేదు. అమెరికా, ఇరాన్ దేశాల వైరం కారణంగా ఫుట్‌బాల్‌లో ఇరుజట్లు తలపడినపుడు కూడా ఆటగాళ్ల మధ్య షేక్‌హ్యాండ్స్ కనిపించవు. అదేమీ నిబంధన కాదు... రూల్ బుక్ చూస్కోండి పహల్గాంలో పాక్ ఉగ్రమూకల ఊచకోతకు గురైన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు పాకిస్తానీ క్రికెటర్లతో పరస్పరం చేయి కలపకూడదని జట్టు మేనేజ్మెంట్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది కోచ్ గంభీర్దో లేదంటే కెపె్టన్ సూర్యకుమార్ నిర్ణయం కానేకాదని జట్టు వర్గాలు స్పష్టం చేశాయి. దాయాది క్రికెటర్ల షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమర్థించుకుంది. ‘ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం ఇవ్వాలనే నిబంధనేది రూల్ బుక్‌లో లేదు. ఇది పూర్తిగా గుడ్‌విల్‌తో ముడిపడిన స్నేహపూర్వక అంశమే! అంతేకానీ చట్టం అయితే కాదు. కాబట్టి కచ్చితంగా షేక్‌హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు స్పష్టత ఇచ్చారు. -
హ్యాండ్‌షేక్.. షాక్
మీరెప్పుడైనా నిలబడి సరదాగా అప్పటిదాకా మాట్లాడుతున్న వ్యక్తితో వీడ్కోలు చెప్పబోతూ కరచాలనం ఇస్తే చేతికి షాక్ కొట్టిందా?. ఎవరో కూర్చున్న కుర్చిని వెనక్కో ముందుకో లాగబోతూ పట్టుకుంటే టప్పున షాక్ కొట్టిందా?. గుండ్రంగా వెండిరంగులో మెరిసే డోర్నాబ్ను పట్టుకోగానే చిన్నపాటి షాక్‌కు గురయ్యారా?. ఈ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చిందనే డౌట్ మీలో ఉండిపోతే అలాంటి సైన్స్ ప్రియుల కోసం పరిశోధకులు కొన్ని సమాధానాలను సిద్ధంచేశారు. చదివేద్దామా మరి !! ఉపరితలం చేసే మేజిక్కుప్రతి వస్తువులో కణాలకు విద్యుదావేశశక్తి దాగి ఉంటుంది. అయితే ఆయా వస్తువుల ఉపరితలాల ఎలక్ట్రిక్ స్థిరత్వం అనేది వాతావరణాన్ని తగ్గట్లు మారతుంది. అంటే గాలిలో తేమ పెరగడం, తగ్గడం, ఎండాకాలం, వర్షాకాలం వంటి సందర్భాల్లో వస్తువుల ఉపరితల ఎలక్టిక్ స్థిరత్వం దెబ్బతిని అసమతుల్యత ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక ప్లాస్టిక్ కుర్చిని తీసుకుంటే దాని ఉపరితల ఎలక్టిక్ ఛార్జ్ అనేది ఎండాకాలంలో ఒకలా, చలికాలంలో మరోలా ఉంటుంది. అదే సమయంలో పాలిస్టర్, ఉన్ని ఇలా విభిన్న వస్త్రంతో తయారైన దుస్తులు ధరించి మనిషి శరీర ఉపరితల ఎలక్ట్రిక్ చార్జ్ సైతం భిన్నంగా ఉంటుంది. చలికాలంలో వాతావరణం చల్లబడటంతో గాలిలో తేమ శాతం తగ్గుతుంది. చల్లటి గాలి అధిక తేమను పట్టి ఉంచలేదు. దీంతో చల్లటి గాలి తగిలిన ప్లాస్టిక్ కుర్చీ ఉపరితలంలో అసమాన ఎలక్ట్రిక్ చార్జ్ ఉంటుంది. దీనిని విభిన్న ఎలక్టిక్ ఛార్జ్ ఉన్న మనిషి హఠాత్తుగా పట్టుకుంటే సమస్థాయికి తీసుకొచ్చేందుకు అత్యంత స్వల్పస్థాయిలో విద్యుత్కణాలు అటుఇటుగా రెప్పపాటు కాలంలో ప్రయాణిస్తాయి. ఉపరితలంలో కదిలే ఆ విద్యుత్ కణాల ప్రవాహ స్పర్శ తగిలి మనం షాక్ కొట్టిన అనుభూతిని పొందుతాం. మనిషి, ఇంకో మనిషికి షేక్ హ్యాండ్ ఇచి్చనప్పుడు కూడా ఇదే భౌతిక శాస్త్ర దృగ్విషయం జరుగుతుంది. అందుకే కొందరు మనుషుల్ని పొరపాటున పట్టుకున్నా మనకు వెంటనే షాక్ కొడుతుంది. అంతసేపు ఒకరు కూర్చున్న ఛైర్‌ను పట్టుకున్నా షాక్ రావడానికి అసలు కారణం ఇదే. చలికాలంలోనే ఎక్కువ! మిగతా కాలంతో పోలిస్తే చలికాలంలో వాతావరణంలో గాలిలో తేమ మారుతుంది. ముఖ్యంగా మనం కొద్దిసేపు ఆరుబయట గడిపి లోపలికి రాగానే అంతసేపు పాలిస్టర్, నైలాన్ వంటి సింథటిక్ దుస్తుల ధరించిన మన శరీర ఉపరితల చార్జ్ అనేది ధనావేశంతో లేదా రుణావేశంతో ఉంటుంది. గదిలోకి వచ్చి వెంటనే అక్కడి మనుషుల్ని, ఛైర్, డోర్‌నాబ్ వంటి వాటిని పట్టుకుంటే అవి అప్పటికే వేరే గాలి వాతావరణంలో భిన్నమైన ఆవేశంతో ఉంటాయి కాబట్టి మనకు షాక్ కొట్టే అవకాశాలే ఎక్కువ. తేమలేని గాలిలో చలికాలంలో ఈ షాక్ ఘటనలు ఎక్కువగా, తేమ అధికంగా ఉండే ఎండాకాలంలో ఈ షాక్ ఘటనలు తక్కువగా చూస్తుంటాం. దీనిని మనం పట్టుకునే, తగిలి, ముట్టుకునే వస్తువుల ఉపరితల ధనావేశం, రుణావేశమే కారణం. దీనిని తప్పించుకోలేమా? ఈ తరహా పరిస్థితుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. మన శరీర ఉపరితల అత్యంత సూక్ష్మస్థాయి విద్యుత్స్థాయిలు ఒకేలా ఉండేలా చర్మానికి లోషన్ లాంటివి రాసుకోవచ్చు. సింథటిక్ వస్త్రంతో చేసిన దుస్తులకు బదులు సహజసిద్ధ కాటన్ దుస్తులు ధరించడం మంచిది. నేల, గడ్డిపై నడిచేటప్పుడు స్టాటిక్ విద్యుత్‌కు గురికాకుండా ఉండాలంటే చెప్పులు, షూ లాంటివి ధరించకుండా చెప్పుల్లేకుండా నడవండి. ఇకపై మీరెప్పుడైనా ఇంట్లో సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి షాక్‌కు గురైతే సరదాగా తీసుకోండి. అద్భుత, విచిత్ర సైన్స్‌కు మీరూ సాక్షీభూతంగా నిలిచామని సంబరపడండి. స్టాటిక్ షాక్ ప్రమాదమా? స్థిర విద్యుత్‌తో మని షికి దైనందిన జీవితంలో ఎలాంటి ప్రమాదంలేదు. సెకన్ వ్యవధిలో షాక్ అనుభూతి వచ్చి పోతుంది. కానీ మండే స్వభావమున్న వస్తువుల సమీపంలో, అత్యంత సున్నితమైన ఎల్రక్టానిక్ వస్తువుల వద్ద మనిషికి స్టాటిక్ విద్యుత్ ప్రాణహాని కల్గించే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా గ్యాస్ స్టేషన్లు, కంప్యూటర్ చిప్ తయారీ కర్మాగారాల్లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ చాలా ప్రమాదకరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్ అధ్యక్షుడితో ప్రధాని కరచాలనం..
బీజింగ్ : భారత్, పాకిస్తాన్ నేతలు ఉమ్మడి వేదికను పంచుకున్న ప్రతిసారీ వారి కదలికలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమవుతుంది. ఆదివారం నాటి షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) భేటీలోనూ ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్‌ల మధ్య చోటుచేసుకున్న మర్యాదపూర్వక సందర్భం అందరినీ ఆకర్షించింది. ఎస్సీఓ సదస్సు నేపథ్యంలో క్వింగ్డాలో మీడియా సమావేశానంతరం మోదీ, హుస్సేన్‌లు కరచాలనం చేసుకున్నారు. భారత్, పాకిస్తాన్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరువురి నేతల మధ్య కరచాలనం ఉత్కంఠ వాతావరణాన్ని తేలికపరిచినా సమస్యలపై లోతైన చర్చల పట్ల మాత్రం సందేహాలు అలాగే ఉన్నాయి. 2016లో యూరి సైనిక శిబిరంపై దాడి అనంతరం భారత్, పాకిస్తాన్ సంబంధాలు బెడిసికొట్టాయి. ఈ దాడికి నిరసనగా భారత్ 19వ సార్క్ సదస్సునూ బహిష్కరించింది. భారత్ నిర్ణయంతో బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్తాన్‌లు సైతం ఇస్లామాబాద్‌లో జరిగే భేటీకి దూరమవుతామని ప్రకటించడంతో సదస్సు రద్దయింది. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లోని పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు, ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
అయ్యో పాపం ట్రంప్.. కెమెరా ముందే మళ్లీనా..
వార్సా: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మీడియా దిష్టి గట్టిగానే తగిలినట్లుంది.. అదేమిటీ అనుకుంటున్నారా.. ఈ మధ్య ఆయన అధికారికంగా కెమెరాల ముందుకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పరాభవాన్ని ఎదుర్కొంటున్నారు. తొందరపాటు మాటల కారణంగా నవ్వుల పాలయ్యే ట్రంప్ ఆయన కదలికలు, హావభావాల మూలంగా కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అది మీడియా కెమెరాలన్నీ కూడా ఆయన వైపు తదేకంగా చూస్తున్న సమయంలోనే. ఏ చిన్న పొరపాటు జరిగినా అలా చటుక్కున బందించేసి ఇలా సోషల్ మీడియాలో పెట్టడమే ఆలస్యం అది చూసిన వాళ్లంతా గొల్లుమని నవ్వుతున్నారు. ఈ మధ్య యూఏఈ పర్యటనకు వెళ్లినప్పుడు డోనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్ చేయిపట్టుకునే ప్రయత్నం చేయగా ఆమె విసిరి కొట్టింది. ఇలా రెండుసార్లు జరిగింది. ఇది చూసిన వాళ్లంతా కూడా తెగ నవ్వుకున్నారు. అయితే, తాజాగా జీ 20 సదస్సులో భాగంగా ట్రంప్ గురువారం పోలాండ్‌కు చెందిన వార్సాలో అడుగుపెట్టిన సందర్భంగా మరోసారి అలాంటి సీనే రిపీటయింది. అయితే, ఈసారి వేరే తీరుగా.. వేరే వ్యక్తి ద్వారా ట్రంప్ ఆ అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఏం జరిగిందంటే వార్సాలో పోలాండ్ అధ్యక్షుడు ఆయన భార్యను కలుసుకున్న సందర్భంగా ట్రంప్ తొలుత పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన పక్కనే పోలాండ్ ప్రథమ మహిళ అగట కార్న్హౌషర్ దుడా ఉన్నారు. తొలు ఆండ్రేజ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే అగట ట్రంప్ వైపు వస్తుండగా తన వద్దకే వచ్చి తనకే ముందు షేక్ హ్యాండ్ ఇస్తారని అనుకున్న ట్రంప్ తొందరపాటుతో చేయి సాచారు. అయితే, ఆమె అనూహ్యంగా ట్రంప్‌కు ఇవ్వకుండా ఆయన భార్య మెలానియా వద్దకు వెళ్లి ఇచ్చింది. దీంతో అవాక్కయిన ట్రంప్ తన హావభావాలు చాలా వెరైటీగా పెట్టారు. ఇది చూసిన అక్కడి కెమెరాలు నవ్వుకున్నాయి. ఇదేమిటి ఇలా జరిగిందని అనుకునే లోపే ఆమె ట్రంప్ వైపు తిరిగి షేక్ హ్యాండ్ ఇవ్వగా నైస్ టూ మీట్ యూ అంటూ ట్రంప్ వెళ్లిపోయారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియో రూపంలో కాకుండా ఆయనకు షేక్ ఇవ్వని సమయంలో ఆయన పెట్టిన హావభావాలతో ఉన్న వీడియోను మాత్రమే జిఫ్ ఫార్మాట్లో పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ పడిపడీ నవ్వుతున్నారు. I love that this failed Trump handshake in Poland is already a gif. Thank you, millennials. pic.twitter.com/5Kwm3eBMac — OhNoSheTwitnt (@OhNoSheTwitnt) 6 July 2017 Folks, Poland's first lady did not diss Trump's handshake attempt. She was looking at Melania, shook her hand, then shook Trump's. Stop. pic.twitter.com/ta8DNsv0Th — Bradd Jaffy (@BraddJaffy) 6 July 2017 Polish first Lady Agata Dudas did shake President Trump's hand, see full video. pic.twitter.com/BOw5tY4R4R — Beatrice-Elizabeth (@MissBeaE) 6 July 2017 -
ఆరోగ్యానికి కరచాలనమే కొలమానం
లండన్: దృఢంగా కరచాలనం చేసేవారు మానసికంగా దృఢంగా ఉంటారని ఇంతకాలం మానసిక వైద్యులు భావిస్తూ వచ్చారు. వారు మానసికంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా దృఢంగా ఉంటారని వియన్నా యూనివర్శిటీ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో తేలింది. వైద్యులు ఇక రోగి తమ వద్దకు రాగానే బీపీ చూసి ఆయన లేక ఆమె ఆరోగ్యం ఎలా ఉందో అంచనా వేయాల్సిన అవసరం లేకుండా రోగితో కరచాలనం చేసి రోగి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చని పరిశోధనల్లో పొల్గొన్న నడియా స్టీబర్ తెలిపారు. కొందరు కరచాలనం చేస్తే దూదిని పట్టుకున్నట్టు మెత్తగా ఉండడం, కొందరు చేసి చేయనట్లు మృదువుగా ఉండడం తెల్సిందే. కరచాలనం ద్వారా ఎవరి ఆరోగ్యానైనా అంచనా వేయాలంటే కరచాలనం ద్వారా వారి చేతి గ్రిప్పును పరిశీలించాలి. గ్రిప్పు బలంగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారు. తక్కువ గ్రిప్పు కలిగిన వారు ఎక్కువ గ్రిప్పు కలిగినవారికన్నా 70 శాతం ముందుగా చనిపోతారని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కరచాలనం చేసే వారి గ్రిప్పుకు వారి వయస్సుకు, ఎత్తుకు కూడా సంబంధం ఉంటుంది. 30 నుంచి 40 ఏళ్ల వయస్సులో కరచాలనం చేసేవారిలో గ్రిప్ప్ పీక్ స్థాయిలో ఉంటుంది. ఆ తర్వాత వయస్సు, ఆరోగ్య పరిస్థితిబట్టి గ్రిప్పు తగ్గుతూ 60 ఏళ్ల తర్వాత ఎక్కువ తగ్గుతుంది. ఎత్తు ఎక్కువ ఉన్నవారికి గ్రిప్పు ఎక్కువగా ఉంటుంది. పురుషులు, మహిళల మధ్య కూడా కరచాలనం గ్రిప్పులో తేడా ఉంటుంది. ఎనిమిది అంగుళాలు ఎత్తు ఎక్కువ ఉన్నవారికి, తక్కువున్న అంతే వయస్సు గల వారిమధ్య కరచాలనం గ్రిప్పులో 20 ఏళ్ల తేడా కనిపిస్తుంది. మొత్తంగా చేతి కండరాల్లో ఉండే బలం ఆ వ్యక్తి ఆరోగ్యం మొత్తంగా ఎలా ఉందనే విషయాన్ని కచ్చితంగా సూచిస్తోందని పరిశోధకులు తేల్చారు. జర్మనీకి చెందిన వివిధ వయస్సులుగల స్త్రీ, పురుషులను ఎంపిక చేసి వియన్నా యూనివర్శిటీ పరిశోధకులు కరచాలనంకు, వారి ఆరోగ్యంగా పరిస్థితిగల సంబంధాన్ని అధ్యయనం చేశారు. ఈ ప్రయోగానికి జర్మన్లనే ఎంపిక చేసుకోవడానికి కారణం కూడా ఉంది. బ్రిటన్లకంటే జర్మన్ల కరచాలనం బలంగా ఉంటుంది. జపాన్ వారికంటే బ్రిటన్ల కరచాలనం బలంగా ఉంటుందనుకోండి. వయస్సు, ఎత్తు కారణంగా ఎవరి కరచాలనం ఎంత దృడంగా ఉండాలో టేబుళ్లను రూపొందించినట్లు ‘పోస్ వన్ జర్నల్’లో పరిశోధకులు తెలియజేశారు.