
బృందంగా శాస్త్రీయ నృత్యం చేస్తుంటే రెండు కళ్లు చాలవేమో అన్నంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి గ్రూప్ డ్యాన్స్ ప్రదర్శనలో అనుకోని అవాంతరంలా వర్షం వస్తే.. కాలు కదపడం కష్టం. అడుగు వేస్తే జరర్రుమని జారిపోవడం ఖాయం. ఆ చిరుజల్లుల్లో అడుగులు తడబడకుండా..లయబద్ధంగా నృత్యం చేయడం అంత ఈజీ కాదు. కానీ ఇక్కడ ఈ బృందం వర్షానికే సవాలు విసిరేలా అత్యంత అద్భుతంగా నృత్యం చేశారు. ఇదంతా ఎక్కడ అంటే..
కర్ణాటకలోని ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మహిళా విద్యార్థులు బృందంగా భరతనాట్యం చేశారు. అది కూడా హనుమాన్ చాలిసాను నృత్య రూపకంగా ప్రదర్శన ఇస్తున్నారు. అయితే కుండపోత వర్షం కురుస్తున్న ఆ విద్యార్థులంతా ఎక్కడ ఆగకుండా ఎంత లయబద్ధంగా డ్యాన్స్ చేశారో చూస్తే..వావ్ ఏం భరతనాట్య ప్రదర్శన అని ప్రశంసించకుండా ఉండలేరు. అందులో అత్యంత హైలెంట్.. అంతమంది అమ్మాయిల మధ్య ఒకేఒక పురుషుడు భరతనాట్య చేస్తూ కనిపించడం.
మన కళ్లుచూస్తోంది నిజమేనా అన్నట్లుగా ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయిగా కలిసిపోయిన ఆ కళాకారుడి నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకు సంబంధించిన వీడియోని ప్రత్యక్షంగా వీక్షించిన ఒక ప్రేక్షకుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన ఆ వీడియోకి జత చేసిన పోస్ట్‌లో వర్షం మీ ప్రదర్శనను అడ్డుకోలేకపోగా..మీ అసామాన్యమైన ప్రదర్శనకు అందంగా మారింది ఆ వర్షపు జల్లు.
జోరు వానలో నాట్యం చేయడం మాటలు కాదనేది సత్యమే అయినా..మీ బృందమంతా ప్రతి స్టెప్‌ని అత్యంత అద్భుతంగా ప్రదర్శించి అలరించారు అంటూ ఆ వీడియోకి వర్షం మీ బృందం ప్రదర్శన ఇవ్వకుండా ఆపలేకపోయింది అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు.
(చదవండి: లండన్‌లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..)