
విదేశాల్లో మన చిరుతిండ్లు ఫేమస్ అవ్వడం కాదు..వాటి రుచికి విదేశీయులు ఫిదా అవుతూ లొట్టలేసుకుంటూ లాగిస్తున్నారు. కేవలం మన ప్రవాస భారతీయులే కాదు..అక్కడ స్థానిక విదేశీయులు కూడా ఇష్టపడటం విశేషం. మళ్లీ మళ్లీ తినేందుకు ఆయా భారతీయ రెస్టారెంట్లు లేదా హోటళ్లకు వస్తున్న వీడియోలను చూశాం. అయితే ఇప్పుడు మనమంతా ఇష్టంగా స్నాక్స్ టైంలో తినే సమోసా లండన్‌లో నివశిస్తున్న భారతీయులకే కాదు అక్కడున్న విదేశీయలకు కూడా అత్యంత ఇష్టమైన వంటకంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో బీహార్‌కి చెందిన వ్యక్తి లండన్‌లోని రద్దీగా ఉండే వీధుల్లో సమోసాలు అమ్ముతున్నట్లు కనపిస్తుంది. ఆ స్టాల్‌పై ఘంటావాలాస్ సమోసాస్. అతడు సమోసాలను పరిశుభ్రంగా తయారు చేసిన తీరుతోపాటు వాటిని అక్కడివాళ్లు ఎంత ఇష్టంగా ఆస్వాదిస్తారో కూడా వివరించడమే కాదు, కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాడు.
అంతేగాదు ఒక బిహారీ లండన్‌లో ఉన్నంత వరకు సమోసాల రుచి ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుందని సగర్వంగా చెబుతున్నాడు. అంతేగాదు ఈ వీడయోకి "లండన్‌లో అత్యుత్తమ సమోసా" అనే క్యాప్షన్ జోడించి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకి ఏకంగా 37 మిలియన్ల వ్యూస్, లైక్‌లు వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి..!.
(చదవండి: భారత్‌లోనే 11 ఏళ్లుగా రష్యన్ మహిళ..! ఆ మూడింటికి ఫిదా..)