ట్రెండీగా బ్రాండ్‌ ప్రమోషన్‌ ఇలా | Hyderabad Youth in Trendy Brand Promotion Sakshi Special Story | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ స్టాండర్డ్ బ్రాండ్‌ ప్రమోషన్‌ ఇలా

Dec 9 2025 7:26 PM | Updated on Dec 9 2025 7:30 PM

Hyderabad Youth in Trendy Brand Promotion Sakshi Special Story

బ్రాండ్‌ ప్రమోటర్లుగా రాణిస్తున్న ఈ తరం..

మన గురించి మనం కాకపోతే ఇంకెవరు చెబుతారు అనేది ఈ తరం నానుడి..! దీనినే ట్రెండీగా బ్రాండ్‌ ప్రమోషన్‌ అంటూ ఈతరం నగర జీవనశైలిలో భాగం చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రాండ్‌ ప్రమోషన్‌ అనే మాట విరివిగా వినబడుతోంది. చిన్న చిన్న స్టార్టప్స్‌ సంస్థల నుంచి మొదలు ఎమ్‌ఎన్‌సీల వరకు ఈ బ్రాండ్‌ ప్రమోషన్‌ సంస్థల సేవలు వినియోగించుకుంటున్నాయి. అధునాతన రీతిలో మారుతున్న జీవన శైలి, వ్యాపార ధోరణుల్లో వచ్చిన వేగం, అన్నింటికీ మించి సోషల్‌ మీడియా విప్లవం.. ఈ మూడు సమ్మేళనంగా పుట్టింది ఒక భారీ మార్కెట్‌ ట్రెండ్‌ ఈ ‘బ్రాండ్‌ ప్రమోషన్‌’. కొన్ని సంవత్సరాలుగా ఈ రంగం మన నగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అద్భుతమైన వృద్ధి సాధించింది. వ్యక్తిగత బ్రాండింగ్‌ నుంచి కార్పొరేట్‌ ప్రమోషన్‌ వరకు, ప్రతీ రంగానికీ ఇది తప్పనిసరి సాధనమైంది.    
– సాక్షి, సిటీబ్యూరో

అభిరుచి, సృజనాత్మకత, డిజిటల్‌ అవగాహన.. ఈ మూడు ఆయుధాలతో హైదరాబాద్‌ యువత (Hyderabad Youth) బ్రాండ్‌ ప్రమోషన్‌ రంగంలో నేటి ‘గేమ్‌ ఛేంజర్స్‌’గా మారుతున్నారు. యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్, ఎక్స్‌(ట్విట్టర్‌) నుంచి పాడ్‌కాస్ట్‌లు, రీల్స్‌ ప్రొడక్షన్, వెబ్‌క్యాంపైన్ల వరకుం ఈ జెన్‌–జీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ తమ సొంత స్టైల్‌తో బ్రాండ్‌లను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. స్టార్టప్‌ కల్చర్‌కు హబ్‌గా నిలిచిన హైదరాబాద్‌లో చిన్న టీమ్‌లే పెద్ద క్యాంపైన్‌లను నడిపిస్తూ పెద్ద మల్టీ నేషనల్‌ కంపెనీలకు టఫ్‌ పోటీ ఇస్తున్నాయి. కొత్త స్టార్టప్స్‌ స్థాపకుల నుంచి స్థానిక హోం–బేస్డ్‌ వ్యాపారులు కూడా వీరి సేవలను ఆశ్రయిస్తున్నారు.

గ్లోబల్‌ స్టాండర్డ్స్‌.. 
ఏఐ ఆధారిత క్యాంపైన్‌ టూల్స్, డేటా–డ్రైవన్‌ మార్కెటింగ్, కంటెంట్‌ ఇంజనీరింగ్, 3డీ రీల్స్, ఏఆర్‌ ఫిల్టర్లు.. ఇప్పుడు హైదరాబాద్‌ బ్రాండ్‌ ప్రమోషన్‌ ఏజెన్సీలు గ్లోబల్‌ స్టాండర్డ్‌లతో పనిచేస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ రంగం మరింత విస్తరించబోతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి వ్యక్తి ఒక బ్రాండ్‌ అయ్యే కాలం వస్తోంది. ప్రతి వ్యాపారం తమ కథను చెప్పాల్సిన అవసరం ఉంది. అలా చెప్పించే వారే ఈ తరం బ్రాండ్‌ ప్రమోటర్లు. నగర జీవనశైలిని ప్రతిబింబించేలా డిజిటల్‌ ప్రపంచంలో తమ కథను చెప్పించుకోవాలంటే ఈ రోజుల్లో బ్రాండ్‌ ప్రమోషన్‌ ఒక ‘లగ్జరీ’ కాదు.. ఒక అవసరం.

‘ఆక్సిజన్‌’ సోషల్‌ మీడియా.. 
సోషల్‌ మీడియా (Social Media) వేదికలు నేటి బ్రాండ్లకు కావాల్సిన ఆక్సిజన్‌ అని చెప్పుకోవచ్చు. ఒక వైరల్‌ రీల్‌ ఒక క్రియేటివ్‌ పోస్టు ఒక చిన్న స్టోరీ ఇవి నిమిషాల్లోనే బ్రాండ్‌ను లక్షల మంది దగ్గరకు తీసుకెళ్లగలిగే శక్తిని కలిగిఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌ నగరం మరింత ప్రత్యేకమైంది. ఇక్కడి ప్రేక్షకులకు ట్రెండ్స్‌పై అద్భుతమైన ‘సెన్స్‌’ ఉండటం. అందుకోసమే నగరంలోని చాలా బ్రాండ్‌ ప్రమోషన్‌ ఏజెన్సీలు ప్రత్యేకంగా ట్రెండింగ్‌ కంటెంట్‌ ల్యాబ్స్, క్రియేటివ్‌ స్టూడియోలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌ భాగస్వామ్యాలను ఏర్పాటు చేసి సరికొత్త ఐడియాలతో బ్రాండ్లను ‘రిలేటబుల్‌’ – ‘వైరల్‌’గా మారుస్తున్నాయి.

కాదేదీ అనర్హం.. 
సినిమా, రాజకీయాలు, వ్యాపారం కాదేది అనర్హం అంటూ అందరికీ బ్రాండ్‌ ప్రమోషన్‌ (Brand Promotion) తప్పనిసరిగా మారింది. ఒకప్పుడు బ్రాండ్‌ ప్రమోషన్‌ అంటే కార్పొరేట్‌ కంపెనీలు, ఎఫ్‌ఎమ్‌సీజీ ఉత్పత్తులు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ.. ప్రస్తుతం రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, సోషల్‌ మీడియా స్టార్‌లు, కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్, ఎడ్యూ–ఇనిస్టిట్యూట్స్, ఈవెంట్‌ ఆర్గనైజర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ తమ ఇమేజ్, వారి పనితీరును ప్రజలకు చేరువ చేసేందుకు డిజిటల్‌ ప్రమోషన్‌ను శాశ్వతమైన భాగంగా మార్చుకున్నారు. ముఖ్యంగా ప్రతి ఎన్నికల సమయంలో డిజిటల్‌ క్యాంపైన్‌లే కీలకం. సినిమా రీలీజ్‌లకు ఇన్‌ఫ్లూయెన్సర్‌ కొలాబ్స్‌ తప్పనిసరి. కొత్త ఉత్పత్తుల కోసం సోషల్‌ హైప్‌ లేకుండా మార్కెట్‌లో నిలబడటం కష్టమైన కాలం ఇది.

సిటీ లైఫ్‌స్టైల్‌.. 
టెక్‌ సిటీ, కల్చర్‌ సిటీ, ఇవన్నీ కలిసిన నగరం హైదరాబాద్‌ (Hyderabad). ఇక్కడి జీవనశైలిలో ‘డిజిటల్‌ ప్రెజెన్స్‌’ ఇప్పుడు ప్రొఫెషనల్‌ ఇమేజ్‌ మాత్రమే కాదు, లైఫ్‌స్టైల్‌ స్టేట్మెంట్‌ కూడా. అవుట్‌డోర్‌ షూట్స్, క్రియేటివ్‌ స్టూడియోలు, ఫ్యాషన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు, స్ట్రీట్‌ ఫుడ్‌ బ్లాగర్లు, ట్రావెల్‌ రీల్స్‌ క్రియేటర్లు ఇలా విభిన్న రంగాల్లో పనిచేసేవారు తమ బ్రాండ్‌ ప్రత్యేకంగా గుర్తింపు పొందేలా చేయడానికి పెద్ద ఎత్తున ప్రమోషన్‌ స్ట్రాటజీలను అనుసరిస్తున్నారు.

చ‌ద‌వండి: మేన‌రికాల జోడు.. భావిత‌రాల‌కు చేటు..!

‘గేమ్‌ ఛేంజర్‌’.. 
సార్వత్రిక మార్కెట్‌లో తమ పేరు నిలబెట్టుకోవడం చిన్న వ్యాపారులకు పెద్ద సవాలు. కానీ బ్రాండ్‌ ప్రమోషన్‌ ఈ గ్యాప్‌ను పూర్తిగా తగ్గించింది. ఒక చిన్న బొటిక్, ఒక క్లౌడ్‌ కిచెన్, ఒక లోకల్‌ బ్యూటీ ప్రొడక్ట్‌.. ఇవి పెద్ద బడ్జెట్‌ లేకుండానే సోషల్‌ మీడియా క్యాంపైన్‌తో భారీ రీచ్‌ సాధిస్తున్నాయి. ఇలాంటి ఉదాహరణలు సిటీలో వందల సంఖ్యలో కనిపిస్తాయి. ఇది నగరపు స్వభావమే.. ప్రతి సృజనాత్మకతకు వేదిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement