అబ్బా ఇది నెక్ట్స్‌ లెవల్‌ ఫీల్‌ బ్రో! | Hyderabad youth signature language craze trend | Sakshi
Sakshi News home page

‘మస్త్‌ వైబ్స్‌ ఉన్నాయి రా’

Jan 19 2026 12:10 PM | Updated on Jan 19 2026 12:35 PM

Hyderabad youth signature language craze trend

సిగ్నేచర్‌ లాంగ్వేజ్‌కు పెరుగుతున్న క్రేజ్‌

జెన్‌ జీ భాషలో హైదరాబాద్‌ ఐడెంటిటీ 

స్టైల్‌ టు సైన్‌ లాంగ్వేజ్‌ అంటున్న కొత్త తరం

స్టేట్‌మెంట్‌గా మారుతున్న మాట్లాడే భాష

ఒకప్పుడు ‘ఇంగ్లిష్‌ బాగా మాట్లాడితేనే స్టైల్‌’

తెలుగు భాషకు కూడా పాష్, ట్రెండీ, మోడ్రన్‌ టచ్‌

హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో జెన్‌ జీ యువత జీవనశైలి రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. దుస్తులు, మ్యూజిక్, ఫుడ్, టెక్నాలజీ వంటి రంగాలు మాత్రమే కాదు.. మాట్లాడే భాష కూడా ఒక స్టేట్‌మెంట్‌గా మారుతోంది. స్పీకింగ్, చాటింగ్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌లోనూ ఈ తరం చూపుతున్న వినూత్నత ప్రస్తుతం లైఫ్‌స్టైల్‌ ట్రెండ్‌గా నిలుస్తోంది. ఒకప్పుడు ‘ఇంగ్లిష్‌ బాగా మాట్లాడితేనే స్టైల్‌’ అనే భావన ఉండేది. కానీ నేటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. తెలుగు భాషను కూడా పాష్‌గా, ట్రెండీగా, మోడ్రన్‌ టచ్‌లో మాట్లాడేస్తున్నారు. హైదరాబాద్‌ యువత మాట్లాడే తెలుగు–ఇంగ్లిష్‌ మిక్స్‌డ్‌ శ్లాంగ్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ పెరుగుతోంది. 
– సాక్షి, సిటీబ్యూరో

నేటి తరానికి ప్రతిదీ ట్రెండే.. మరీ ముఖ్యంగా జెన్‌ జీ తరం డ్రెస్సింగ్‌ మొదలుకుని మాట్లాడే భాష వరకూ ప్రతిదీ ట్రెండే.. దీనికితోడు ఈ మధ్య కాలంలో సిగ్నేచర్‌ లాంగ్వేజ్‌కు, సైన్‌ లాంగ్వేజ్‌కు పెరుగుతున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదనే చెప్పాలి. మెసేజింగ్‌ నుంచి మాట్లాడే వారకూ అంతా వింతగా మిక్స్‌డ్‌ కల్చర్‌ కనిపిస్తోంది. దీనిని ఓ ఐడెంటిటీగా మార్చుకుంటోంది నేటి తరం. హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో ఇదో స్టైల్‌ స్టేట్‌మెంట్‌గా (Style Statement) మారుతోంది. ఒకప్పుడు ఇంగ్లిష్‌ మాట్లాడితేనే స్టైల్‌గా ఫీలయ్యేవారు.. కానీ నేటి తరం తెలుగు, ఇంగ్లిష్‌ ఇలా స్థానిక భాషలను మిక్స్‌ చేస్తూ.. ఎంజాయ్‌ చేస్తున్నారు.  

తెలుగు ప్లస్‌ ఇంగ్లిష్‌ = జెన్‌ జీ సిగ్నేచర్‌ లాంగ్వేజ్‌ ‘అబ్బా ఇది నెక్ట్స్‌ లెవల్‌ ఫీల్‌ బ్రో!’, ‘సీన్‌ సెట్‌ అయిపోయింది’, ‘మస్త్‌ వైబ్స్‌ ఉన్నాయి రా’ ఇలాంటి మాటలు ఇప్పుడు కాలేజ్‌ క్యాంపస్‌లు, ఐటీ ఆఫీసులు, కాఫీ షాపులు, మెట్రో రైడ్స్‌లో సాధారణంగా వినిపిస్తున్నాయి. ఇది కేవలం సరదా మాటల్లో మార్పు కాదుం.. జెన్‌ జీ తమ ఐడెంటిటీని వ్యక్తపరిచే ఒక కొత్త భాషా సంస్కృతి. ఈ భాషలో గ్రామర్‌ కంటే ఎక్స్‌ప్రెషన్‌ ముఖ్యమైంది. మాటల్లో ఫ్లో ఉండాలి, యాటిట్యూడ్‌ కనిపించాలి, వినేవారికి కనెక్ట్‌ కావాలి. అదే ఈ తరం కమ్యూనికేషన్‌ స్టైల్‌. 

సోషల్‌ మీడియా  శ్లాంగ్‌.. 
ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్‌ షార్ట్స్, స్నాప్‌చాట్‌ స్టోరీస్‌ ఇవన్నీ ఇప్పుడు లాంగ్వేజ్‌ ట్రెండ్స్‌ను డిసైడ్‌ చేసే ప్లాట్‌ఫామ్స్‌గా మారాయి. కొందరు కంటెంట్‌ క్రియేటర్లకు ఫాలోవర్స్‌ పెరగడానికి కారణం వారి కాన్సెప్ట్‌ మాత్రమే కాదు.. వాళ్లు మాట్లాడే స్టైలే కారణం. హైదరాబాదీ యాక్సెంట్, లోకల్‌ శ్లాంగ్, పంచ్‌ డైలాగ్స్‌–ఇవన్నీ కలిసినప్పుడు రీల్‌ వైరల్‌ అవుతోంది. ‘బాబోయ్‌ ఇదేం క్రేజ్‌ రా!’ అనేలా ప్రేక్షకులు స్పందిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఆ శ్లాంగ్‌ని కాపీ చేస్తూ తమ రోజువారీ భాషలో కలుపుకుంటున్నారు. ఇలా సోషల్‌ మీడియా నుంచి రియల్‌ లైఫ్‌కు భాష ట్రాన్స్‌ఫర్‌ అవుతోంది. 

తరం, ఆంతర్యం మారుతూ.. 
భాష మార్పు అనేది సమాజం మార్పుకు అద్దం పడుతోంది. హైదరాబాద్‌ జెన్‌ జీ మాట్లాడే భాష చూస్తే వారి మైండ్‌సెట్‌ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ గ్లోబల్‌గా ఆలోచించడం, లోకల్‌గా కనెక్ట్‌ కావడం కోసం ఇంగ్లిష్‌ వాడుతున్నారు.. కానీ తెలుగు వదలడం లేదు. తెలుగు మాట్లాడుతున్నారు.. కానీ పాత బరువు మోసుకోవడం లేదు. ఇది సంప్రదాయానికి దూరమవ్వడం కాదు.. సంప్రదాయాన్ని అప్‌డేట్‌ చేయడమనేది ఈ తరం మాట.

భవిష్యత్తు భాష ఇదేనా? 
లింగ్విస్టులు, కమ్యూనికేషన్‌ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయం ప్రకారం జెన్‌ జీ క్రియేట్‌ చేస్తున్న ఈ హైబ్రిడ్‌ లాంగ్వేజ్‌ భవిష్యత్తులో మరింత పాపులర్‌ అవ్వనుంది. ఇది ఉద్యోగ రంగంలోనూ, మీడియా కంటెంట్‌లోనూ ప్రభావం చూపించే అవకాశం ఉంది. హైదరాబాద్‌ లాంటి నగరాలు ఎప్పుడూ ట్రెండ్స్‌కు సెట్టర్స్‌. ఇప్పుడు ఆ ట్రెండ్‌ పేరు జెన్‌ జీ లాంగ్వేజ్‌ లైఫ్‌స్టైల్‌. భాష కేవలం పుస్తకాలకే పరిమితం కాదు. మాట్లాడే తీరు కూడా ఒక ఫ్యాషన్‌. ఆ ఫ్యాషన్‌ని ఫాలో అవుతోంది హైదరాబాద్‌ జెన్‌ జీ (Hyderabad Genz).

చ‌ద‌వండి: ఆ ఒక్క నిర్ణ‌యంతో అద్భుత ఫ‌లితాలు  

షార్ట్, షార్ప్‌ చాటింగ్‌..  
జెన్‌ జీ చాటింగ్‌ స్టైల్‌ చూస్తే భాష ఎంత వేగంగా మారుతోందో.. అర్థమవుతుంది. పూర్తి వాక్యాలు, పూర్తి పదాలలో చాటింగ్‌ చాలా అరుదు. నేటి తరానికి అంతా షార్ట్, షార్ప్‌.. ‘ఒకే’ కంటే ‘కేకే’, ‘సీరియస్లీ?’ కంటే ‘ఎస్‌ ఆర్‌ ఎస్‌ ఎల్‌ వై?’, ‘అలానా?’ కంటే ‘అవ్నా?’ అంతే కాదు ఎమోజీలు, జిఫ్‌ లు, వాయిస్‌ నోట్స్‌ కూడా భాషలో భాగమే. చాటింగ్‌ అనేది ఇక రాత మాత్రమే కాదు.. ఒక విజువల్‌ ఎక్స్‌ప్రెషన్‌. ఇందులో తెలుగు (Telugu) కూడా కొత్త రూపంలో కనిపిస్తోంది. తెలుగు అక్షరాలకన్నా రోమన్‌ తెలుగులో టైపింగ్‌ ఎక్కువైంది. ఇది భాషను తక్కువ చేయడం కాదు.. భాషను యూజర్‌–ఫ్రెండ్లీగా మార్చడం అని నిపుణులు చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement