
విదేశాలను ఆకర్షిస్తున్న మన దేశ సంస్కృతి వారిని ఇక్కడే ఉండేలా చేసేలా మన్ననలను అందుకుంటోంది. ఎందరో మనసులను దోచిన ఇచ్చటి విభిన్న సంస్కృతులు, ఆతిథ్యం తమను మళ్లీ మళ్లీ ఈ గడ్డ వద్దకు వచ్చేలా చేస్తుందని, వదిలి వెళ్లలేమని అంటున్నారు. అలా ప్రశంసలు కురిపిస్తున్న విదేశీయుల కోవలోకి తాజాగా ఈ రష్యన్ మహిళ కూడా చేరిపోయింది. పైగా ఆమూడింటికే పడిపోయానని, అంతలా అవి తనని ప్రభావితం చేశాయని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది.
రష్యాన్ మహిళ కంటెంట్ క్రియేటర్ యులియా ఇన్‌స్టా పోస్ట్‌లో భారత్‌లోనే 11 ఏళ్లుగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక్కడి భారతదేశం తనను ఎలా ప్రభావితం చేసిందో పంచుకుంది. ఐదు నెలల్లో పూర్తిచేసే ఇంటర్న్‌షిప్‌కు వచ్చి..అతుక్కుపోయానంటోంది.
ఇంటర్న్‌షిప్ పూర్తి అయ్యి తిరిగి రష్యాకు పయనమయ్యానని, ఆ తర్వాత కొన్నేళ్లకు సర్కస్ కోసం ఏనుగుని కొనడానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయానని చెప్పుకొచ్చింది. ఇక్కడే విజయవంతంగా వ్యాపారం చేయడమే గాక, ఇక్కడ ఒక కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టి ఇక్కడే ఉండిపోయానంటోంది.
కట్టిపడేసిన ఆ మూడు విషయాలు..
భారతదేశంలో ఆతిథ్యం వేరేస్థాయిలో ఉంటుంది. ప్రజలు చాలా ఘటనంగా స్వాగతిస్తారు. వారి విశాల హృదయం కట్టిపడేస్తుంది. ప్రతి విషయంలోనూ మంచి సహాయకారిగా ఉంటారు. ఇక్కడ చాలామటుకు అందరూ సహాయం చేయడానికే ప్రయత్నిస్తారు. అంతేగాదు భారతదేశం ఒక అయస్కాంతంలాంటిదని, ఇక్కడ ఏమి చూడాలనుకుంటున్నారో, విశ్వానికి ఏమి అందించాలనుకుంటున్నారో, అన్నింటిని ఈనేలే మీకు దిశానిర్దేశం చేస్తుంది.
నాలా ఈ భారతదేశంలోకి అడుగుపెట్టి, కొన్ని సవాళ్లను అధిగమించి మరి ఇక్కడి అందాలకు మంత్రముగ్ధులైన వారిక కథలెన్నో నా చెంత ఉన్నాయని ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
(చదవండి: Dance For Fitness: మొన్నటి వరకు ఆనంద తాండవమే..ఇవాళ ఆరోగ్య మార్గం..!)