
‘ఫ్యాషన్ అంటే మనల్సి మనం అందంగా తీర్చిదిద్దుకోవడం.. సౌందర్యంగా కనిపిస్తూనే సౌకర్యంగా ఉండటం మరింత బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఈ మధ్యనే సరికొత్త కథాంశంతో విడుదలైన ‘పరదా’ సినిమాలో మగువల భావోద్వేగాలను, సామాజిక పరిస్థితులను తెరకెక్కించాం. ఇది ప్రభావవంతమైన కథాంశం, నటన పరంగానూ అందరి ప్రశంసలు పొందింది.’ అంటూ చెప్పుకొచ్చారు అందాల తార అనుపమ పరమేశ్వరన్. నగరంలోని బంజారాహిల్స్ వేదికగా స్వదేశీ ఫ్యాషన్ బ్రాండ్ ‘బిబా’ ఫ్లాగ్‌ప్ స్టోర్‌లో సోమవారం సందడి చేశారు. ఈ వేదికపై నూతనంగా రూపొందించిన ఫెస్టివ్ కలెక్షన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనుపమ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఫ్యాషన్ ట్రెండ్స్, తదుపరి సినిమాల విశేషాలు ఆమె మాటల్లోనే..!
హైదరాబాద్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ఫ్యాషన్ హంగులను చూస్తే సంతోషంగా అనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఇండో వెస్ట్రన్ ఫ్యాషన్ వేర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇదే నా స్టైల్ స్టేట్మెంట్. ముఖ్యంగా కాటన్, స్మూత్‌కాటన్ ఇష్టపడతాను. గ్రాండ్ లుకింగ్ కన్నా కంఫర్ట్ ముఖ్యం. మన మూలాల్లోని ఫ్యాబ్రిక్, సంస్కృతి–అధునాతన డిజైనింగ్ సమ్మిళిలితం చేస్తే ఎక్కువగా ఆకర్షిస్తుంది.
వాటిని ప్రోత్సహిండం ఇష్టం. బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అమ్మాయిలకు అనువుగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి శారీస్, ఈవెంట్స్‌ను బట్టి డ్రెస్ వేసుకుంటా. మహిళల ఫ్యాషన్ వేర్ అంతర్గత శక్తిని, మానసిక స్థితిని తెలియజేస్తుందని నమ్ముతాను.
నాకు రెడ్ కలర్, మస్టర్డ్ యెల్లో రంగుల దుస్తులే నచ్చుతాయి. రెడ్ అంటే పవర్‌ఫుల్.. నేను ఎక్కువ షాపింగ్ చేయను. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ వెళ్లినప్పుడు కచి్చతంగా షాపింగ్ చేస్తుంటాను. సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి షూటింగ్స్ వెళ్లినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో, సందడి లేని ఇతర షాపింగ్ ప్రదేశాల్లో కొనుగోలు చేస్తాను. ‘డిఫరెంట్ బై డిజైన్’ అనే ఫిలాసఫీని ప్రతిబింబించేలా బిబా అందిస్తున్న దసరా కలెక్షన్ మన సాంస్కృతిక మూలాలను గుర్తుచేస్తుంది.
వరుస షూటింగ్స్‌తో బిజీ..
సినిమాల పరంగా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ వాతావరణంలో సరికొత్త అనుభూతిని పొందుతాను. ఈ మధ్యే తెలుగులో నా ‘పరదా’ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో ‘కిష్కిందపురి’ సినిమా విడుదల కానుంది.
కిష్కిందపురి తరువాత ‘బైసన్’ కూడా విడుదలకు సిద్ధమౌతోంది. ఈ రెంటితో పాటు ‘భోగీ’ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది షూటింగ్ పూర్తి కానుంది. మరో తెలుగు సినిమాలోనూ నటిస్తున్నాను. ఇవి కాకుండా మలయాళంలో మరో రెండు సినిమాలు చేస్తున్నా.