సాక్షి, ముంబై: టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా తల్లి, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా సవతి తల్లి సైమన్ టాటా (95) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో దుబాయ్‌లోని కింగ్స్ హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స పొందిన తర్వాత ఈ ఆగస్టు ప్రారంభంలో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.
సైమన్ టాటా అస్తమయం పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా , లక్మే మాజీ చైర్‌పర్సన్ , భారతదేశ బ్యూటీ అండ్ రిటైల్ ల్యాండ్‌స్కేప్‌లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరంటూ ఆమెకు నివాళులర్పించారు. నా షీరో ఇక లేరంటే చాలా బాధగా ఉంది, "మహిళా వ్యాపార నాయకులలో అగ్రగామి"అని తన సంతాపాన్ని ప్రకటించారు.

సైమన్ టాటాకు సంబంధించి ఆసక్తికర సంగతులు.
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జన్మించారు సైమన్ నావల్ డునోయర్ 1953లో భారతదేశానికి పర్యాటకురాలిగా వచ్చారు.
రెండేళ్ల తరువాత 1955లో ఆమె నావల్ హెచ్. టాటాను వివాహం చేసున్నారు.
1960ల ప్రారంభంలో టాటా గ్రూప్‌తో తన వృత్తిపరమైన అనుబంధాన్ని ప్రారంభించారు.
1961లో టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ లక్మే బోర్డులో చేరారు. 1982లో ఆమె చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
భారతదేశ ఆధునిక సౌందర్య సాధనాల రంగంలో ఆమె చేసిన విశేష కృషికి గాను "కాస్మెటిక్ క్జారినా ఆఫ్ ఇండియా" అనే బిరుదును దక్కించుకున్నారు.
వెస్ట్‌సైడ్ & ట్రెంట్ రిటైల్ వ్యవస్థాపకురాలుగా ఆమె ఫ్యాషన్ రంగంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. 1998లో లక్మీని హిందూస్తాన్ యూనిలీవర్‌కు విక్రయించిన తర్వాత, సిమోన్ టాటా రిటైల్ విభాగమైన ట్రెంట్ లిమిటెడ్‌కు నాయకత్వం వహించారు.
తరువాత వె స్ట్‌సైడ్‌ను ప్రారంభించి భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఫ్యాషన్ రిటైల్ చెయిన్‌గా తీర్చిదిద్దారు. ఇపుడు ఆ తరువాత జూడియో స్టోర్‌లలోకి విస్తరించింది.
లక్ష కోట్ల రూపాయల రిటైల్ అండ్ బ్యూటీ సామ్రాజ్యాన్ని స్థాపించిన సైమన్ చాలా లోప్రొఫైల్‌మెయింటైన్ చేసేవారు. తన జీవితంలోని అనేక సవాళ్లను అధిగమించి విజయ వంతమైన వ్యాపారవేత్తగా, దార్శనికురాలిగా తన పేరును శాశ్వతం చేసుకున్న గొప్ప మహిళ సైమన్ టాటా.
ఆమెకు కుమారుడు నోయెల్ టాటా, కోడలు ఆలూ మిస్త్రీ , మనవరాళ్ళు నెవిల్లే, మాయ , లియా ఉన్నారు.
ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్‌లైన్‌లోనే రిసెప్షన్


