
అందరికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించదు. కుటుంబ బాధ్యతల రీత్యా కొందరికి అది అందని ద్రాక్షలా ఉంటుంది. అలాంటి వాళ్లు తమకు అవకాశం చిక్కినప్పుడు వయోభారాన్ని సైతం పక్కన పెట్టి చదవాలనుకున్న కోర్సులని చదివేయడమే కాదు ఉత్తీర్ణులై ఆశ్చర్యపరుస్తారు. అలాంటి అద్భుత ఘట్టమే ఇక్కడ చోటు చేసుకుంది. దాన్ని అతని కొడుకు ఎలా సెలబ్రేట్ చేశాడో చూస్తే మాత్రం విస్తుపోతారు. అందుకు సంబంధించిన వీడియ నెట్టింట తెగ వైరల్‌గా మారింది
52 ఏళ్ల ముంబై వ్యక్తి ఎంబిఏ పట్టాని సంపాదించి అద్భుతమైన మైలు రాయిని సాధించాడు. చదవాలనే జిజ్ఞాశ ఉంటే వయసు ఆశయానికి అడ్డంకి కాదని ప్రూవ్ చేశాడు. ఆ అపురూప క్షణాన్ని అతడి కుమారుడు మైత్రేయ సాథే ఎంత అందంగా గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేశాడంటే..ఆ తండ్రి ఆ సర్‌ప్రైజ్‌కి ఉబ్బితబ్బిబైపోయాడు.
తన తండ్రి ముఖాకృతితో కూడిన గ్రాడ్యుయేట్ క్యాప్‌ని ముఖానికి పెట్టుకుని దర్శనమిస్తూ..కంగ్రాట్స్ చెబుతారు. ఆ అనుహ్యపరిణామానికి నోట మాటరాక ఒక్క క్షణంపాటు బిగిసుకుపోయి..ఆ తర్వాత తేరుకుని చిరునవ్వులు చిందిస్తాడు ఆ తండ్రి.
అంతేగాదు అతడి కోసం కుటుంబం మొత్తం రాసిన కలర్‌ఫుల్ సందేశాల నోట్స్‌ని చదువుతూ..ఉప్పొంగిపోతాడు. పైగా ఆ ఘన సత్కారానికి ఆ తండ్రి ముఖం చిచ్చుబుడ్డిలా కాంతిగా వెలిగిపోతుంది. అందుకు సంబంధించిన వీడియోకి ..'మా నాన్న గ్రాడ్యుయేట్' అనే క్యాప్షన్ జత చేసి మరి పోస్ట్ చేశాడు.
ఆన్‌లైన్‌లో ఇలాంటి విస్తుపోయే కథలెన్ని చూసినా..ఓ తండ్రి తన ఆశయాన్ని నెరవేర్చుకున్నప్పుడూ అతడి మొత్తం కుటుంబమే సంబంరంలో మునిగిపోతుంది. వయసులో ఉన్నప్పుడూ సాధించిన విజయం కంటే వయసు మళ్లినప్పుడూ అంతే ఉత్సాహంతో విజయం సాధిస్తే ఆ కిక్కే వేరు, పైగా ఫ్యామిలీ ముందు హీరో రేంజ్‌లో ఫోజులిచ్చే ఛాన్స్‌ని కొట్టేయొచ్చు కదూ..!
(చదవండి: వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!)