ప్రముఖ బుల్లితెర భామ, బిగ్‌బాస్ బ్యూటీ రూపాలి త్యాగి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు నోమిష్ భరద్వాజ్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో సినీతారలు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ డిసెంబర్ 5న జరిగింది.
కాగా.. రూపాలి త్యాగి సప్నే సుహానే లడక్‌పన్ కే సీరియల్లో గుంజన్ పాత్రతో ఫేమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్- 9లో కంటెస్టెంట్గా పాల్గొంది. కాగా.. వీరిద్దరు రెండు సంవత్సరాల క్రితం ముంబయిలో స్నేహితుల ద్వారా పరిచయమయ్యారు. ముంబయికి చెందిన నోమిష్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో యానిమేషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.
రూపల్ త్యాగి కెరీర్..
హమారీ బేటియూన్ కా వివాహ్ సీరియల్తో కెరీర్ ప్రారంభించిన రూపాలి త్యాగి..బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించింది. ఏక్ నయీ చోటి సి జిందగీ, రంజు కి బేటియాన్, కసమ్ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్ కీ, యంగ్ డ్రీమ్స్ లాంటి హిందీ సీరియల్స్‌లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్‌గా కూడా రాణిస్తోంది. అంతేకాకుండా బిగ్ బాస్ -9 తో పాటు 2015లో ఝలక్ దిఖ్లా జా -8 లాంటి రియాలిటీ షోలో కూడా పాల్గొంది.


