ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Horoscope In Telugu From 07-09-2025 To 13-09-2025 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Sep 7 2025 12:23 AM | Updated on Sep 7 2025 12:25 AM

Weekly Horoscope In Telugu From 07-09-2025 To 13-09-2025

మేషం...
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మిత్రులతో నెలకొన్న విభేదాలు పరిష్కరించుకుంటారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ హోదాలు కొంత పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు భాగస్వాములతో సఖ్యత. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు.  దేవీస్తుతి మంచిది.

వృషభం...
మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో  సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. నీలం, నేరేడు రంగులు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

మిథునం...
కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. పనుల్లో విజయం సాధిస్తారు. కొన్ని ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఇంటì  నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. నిరుద్యోగుల శ్రమ కొంత ఫలిస్తుంది.  వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో  కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు.  హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం...
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. విష్ణుధ్యానం చేయండి.

సింహం...
చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. స్థిరాస్తి వృద్ధి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వివాహయత్నాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగార్ధులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు.  గణేశాష్టకం పఠించండి.

కన్య...
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలై అవసరాలు తీరతాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుని లాభాలు అందుకుంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళారంగం వారికి చికాకులు తొలగుతాయి. వారం చివరిలో అనారోగ్యం. దూరప్రయాణాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల...
ముఖ్యమైన పనులు కుదించుకుంటారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యాపారాలు కొంతవరకూ లాభిస్తాయి. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం...
అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెంచుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. విద్యార్థులకు కొంత ఊరట లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. నిరుద్యోగుల యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. పసుపు, నీలం రంగులు.  అంగారక స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు..
కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆశ్చర్యకర సమాచారం అందుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నేర్పుగా శత్రువులను కూడా ఆకర్షిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారాలలో మరింత అనుకూల పరిస్థితులు. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.

మకరం....
అనుకోని ప్రయాణాలు. బంధువుల నుంచి అందిన సమాచారం కాస్త ఊరట కలిగిస్తుంది. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కేందుకు యత్నిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశముంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. విధుల్లో అప్రమత్తత పాటించండి.  రాజకీయవర్గాలకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. సన్నిహితులతో విభేదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. సూర్యాష్టకం పఠించండి.

కుంభం...
కొత్త పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ చూరగొంటారు. ఆస్తుల వ్యవహారాలలో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థికంగా బలపడతారు.  సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే లాభిస్తాయి. ఉద్యోగాలలో క్లిష్టమైన పరిస్థితులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిళ్ల నుంచి విముక్తి. వారం మధ్యలో  వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. తెలుపు, పసుపు రంగులు.  దేవీఖడ్గమాల పఠించండి.

మీనం...
ఆర్థిక పరిస్థితి కొంత సానుకూలం.  ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. బంధువుల నుంచి ఉపయుక్తమైన విషయాలు తెలుస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement