శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.విదియ రా.12.51 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: మృగశిర ప.11.59 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రా.7.53 నుంచి 9.23 వరకు,దుర్ముహూర్తం: ఉ.6.14 నుంచి 7.55 వరకు, అమృత ఘడియలు: రా.1.10 నుంచి 2.40 వరకు.
సూర్యోదయం : 6.20
సూర్యాస్తమయ: 5.21
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు
మేషం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. కీలక నిర్ణయాలు. పనుల్లో అనుకూలత. గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు మరింత సానుకూలమైన కాలం.
వృషభం: కుటుంబసభ్యులతో వివాదాలు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ఆస్తి వివాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలించవు. ఉద్యోగాల్లో కొన్ని మారుμలు.
మిథునం: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తి తగాదాల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారాల ప్రారంభం. ఉద్యోగులకు సంతోషకరమైన ప్రకటనలు. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆర్ధికంగా ఇబ్బందులు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. పనుల్లో ఆటంకాలు. దైవదర్శనాలు.
సింహం: ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. భూసంబంధిత వివాదాలు పరిష్కారం. చాకచక్యంగా పనులు చక్కదిద్దుతారు.. వ్యాపారాలలో ముందంజ. ఉద్యోగులకు ప్రమోషన్లు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి.
కన్య: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థికాభివృద్ధి. కుటుంబసభ్యుల నుంచి సహాయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. చేపట్టిన వ్యవహారాలు పూర్తి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. దైవచింతన.
తుల: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు నిలిచిపోయే అవకాశం.
వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధు,మిత్రులతో విరోధాలు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. పనుల్లో ప్రతిష్ఠంభన. అనారోగ్యం.
ధనుస్సు: కొత్త పరిచయాలు. శుభవార్తా శ్రవణం. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. కార్యక్రమాలలో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని ఇంక్రిమెంట్లు.
మకరం: ప్రముఖులు పరిచయమవుతారు. ఆసక్తి కలిగించే సమాచారం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో ఉత్సాహం. పాతబాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు..
కుంభం: బంధువులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు∙నిరాశ కలిగించవచ్చు. పనులలో ఆటంకాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు
.
మీనం: పనుల్లో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. వివాదాలకు దూరంగా ఉండండి. వాహనాలు నడిపే వారు అప్రమత్తత పాటించండి. వ్యాపార లావాదేవీలు సామాన్యం. ఉద్యోగులకు స్థానమార్పు సూచనలు.


