అయ్యో పాపం ట్రంప్‌.. కెమెరా ముందే మళ్లీనా.. | Trump's Handshake With Poland's First Lady Has Twitter Buzzing | Sakshi
Sakshi News home page

అయ్యో పాపం ట్రంప్‌.. కెమెరా ముందే మళ్లీనా..

Jul 7 2017 7:04 PM | Updated on Aug 25 2018 7:52 PM

ట్రంప్‌కు మీడియా దిష్టి గట్టిగానే తగిలినట్లుంది.. అదేమిటీ అనుకుంటున్నారా..



వార్సా: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు మీడియా దిష్టి గట్టిగానే తగిలినట్లుంది.. అదేమిటీ అనుకుంటున్నారా.. ఈ మధ్య ఆయన అధికారికంగా కెమెరాల ముందుకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పరాభవాన్ని ఎదుర్కొంటున్నారు. తొందరపాటు మాటల కారణంగా నవ్వుల పాలయ్యే ట్రంప్‌ ఆయన కదలికలు, హావభావాల మూలంగా కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అది మీడియా కెమెరాలన్నీ కూడా ఆయన వైపు తదేకంగా చూస్తున్న సమయంలోనే. ఏ చిన్న పొరపాటు జరిగినా అలా చటుక్కున బందించేసి ఇలా సోషల్‌ మీడియాలో పెట్టడమే ఆలస్యం అది చూసిన వాళ్లంతా గొల్లుమని నవ్వుతున్నారు.

ఈ మధ్య యూఏఈ పర్యటనకు వెళ్లినప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన సతీమణి మెలానియా ట్రంప్‌ చేయిపట్టుకునే ప్రయత్నం చేయగా ఆమె విసిరి కొట్టింది. ఇలా రెండుసార్లు జరిగింది. ఇది చూసిన వాళ్లంతా కూడా తెగ నవ్వుకున్నారు. అయితే, తాజాగా జీ 20 సదస్సులో భాగంగా ట్రంప్‌ గురువారం పోలాండ్‌కు చెందిన వార్సాలో అడుగుపెట్టిన సందర్భంగా మరోసారి అలాంటి సీనే రిపీటయింది. అయితే, ఈసారి వేరే తీరుగా.. వేరే వ్యక్తి ద్వారా ట్రంప్‌ ఆ అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఏం జరిగిందంటే వార్సాలో పోలాండ్‌ అధ్యక్షుడు ఆయన భార్యను కలుసుకున్న సందర్భంగా ట్రంప్‌ తొలుత పోలాండ్‌ అధ్యక్షుడు ఆండ్రేజ్‌ దుడాకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన పక్కనే పోలాండ్‌ ప్రథమ మహిళ అగట కార్న్‌హౌషర్‌ దుడా ఉన్నారు.

తొలు ఆండ్రేజ్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చిన వెంటనే అగట ట్రంప్‌ వైపు వస్తుండగా తన వద్దకే వచ్చి తనకే ముందు షేక్‌ హ్యాండ్‌ ఇస్తారని అనుకున్న ట్రంప్‌ తొందరపాటుతో చేయి సాచారు. అయితే, ఆమె అనూహ్యంగా ట్రంప్‌కు ఇవ్వకుండా ఆయన భార్య మెలానియా వద్దకు వెళ్లి ఇచ్చింది. దీంతో అవాక్కయిన ట్రంప్‌ తన హావభావాలు చాలా వెరైటీగా పెట్టారు. ఇది చూసిన అక్కడి కెమెరాలు నవ్వుకున్నాయి.

ఇదేమిటి ఇలా జరిగిందని అనుకునే లోపే ఆమె ట్రంప్‌ వైపు తిరిగి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వగా నైస్‌ టూ మీట్‌ యూ అంటూ ట్రంప్‌ వెళ్లిపోయారు. అయితే, సోషల్‌ మీడియాలో మాత్రం ట్రంప్‌ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చిన వీడియో రూపంలో కాకుండా ఆయనకు షేక్‌ ఇవ్వని సమయంలో ఆయన పెట్టిన హావభావాలతో ఉన్న వీడియోను మాత్రమే జిఫ్‌ ఫార్మాట్‌లో పెట్టి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ పడిపడీ నవ్వుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement