
ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. కౌంటింగ్.. ఫలితాల అప్‌డేట్స్
ఓటేసిన లోక్‌సభ స్పీకర్
ఉపరాష్ట్రపతి ఎన్నిక.. కొనసాగుతున్న పోలింగ్
ఓటేసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా

ఇది బీజేపీకి ఎదురుదెబ్బే: సంజయ్ రౌత్
ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌కు బీఆర్‌ఎస్, బీజేడీ, అకాలీదళ్ దూరం
ఈ మూడు బీజేపీతో గతంలో అంటకాగిన పార్టీలేనన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్
ఇప్పుడు దూరంగా ఉండడం ఆ పార్టీకి ఎదురుదెబ్బేనని వ్యాఖ్య
96 శాతం పోలింగ్ నమోదు
కొనసాగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్
3గం. దాకా 96 శాతం పోలింగ్ నమోదు
5 గం. దాకా జరగనున్న పోలింగ్
6గం. కౌంటింగ్ మొదలు
7.45గం. కి ఫలితం వెల్లడి
ఇండియా కూటమి వైపే ఒవైసీ
ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి
సుదర్శన్‌రెడ్డికి మద్దతు ప్రకటించిన ఎంఐఎం
హైదరాబాద్‌వాసి, గౌరవనీయుడైన న్యాయకోవిదుడికి మద్దతంటూ ఒవైసీ ట్వీట్
ఓటు హక్కు వినియోగించుకున్న ఒవైసీ
విజయంపై ఎన్డీయే ధీమా
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
రాత్రికల్లా వెలువడనున్న ఫలితం
సంఖ్యా బలం దృష్ట్యా.. విజయంపై ఎన్డీయే ధీమా
ముందస్తుగా.. విందు ఏర్పాట్లలో ముమ్మరం
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ ఇంట ఎన్టీయే కూటమి కీలక నేతలకు విందు ఏర్పాట్లు
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు
ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కి మద్దతు ప్రకటించిన వైఎస్సార్‌సీపీ
పోలింగ్‌కు దూరంగా మరో పార్టీ
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా శిరోమణి అకాలీదల్
పార్లమెంట్‌లో ఎస్‌ఏడీ సంఖ్యా బలం.. మూడు
ఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించిన బీజేడీ, బీఆర్‌ఎస్
ఓటు హక్కు వినియోగించుకోనున్న 769 మంది ఎంపీలు
కొనసాగుతున్న ఉపరాష్ట్రపతి పోలింగ్
ఒక్కొక్కరుగా ఓటు వేస్తున్న ఎంపీలు
సాయంత్రం 6గంటల తర్వాత వెలువడనున్న ఫలితాలు
తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ

అనంతరం.. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గే తదితరులు
ఓటింగ్ వేళ ప్రత్యేక ఆకర్షణగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
ఓటేశాక.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన రాహుల్ గాంధీ
సాయంత్రం ఐదు గంటల దాకా జరగనున్న పోలింగ్
ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ
నో విప్.. తమకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యం ప్రకారం ఓట్లేయనున్న ఎంపీలు
నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా గడిలో 1 అంకె
తదుపరి ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థి పేరు ఎదుటనున్న గడిలో 2 అంకె
ఎన్నికల సంఘం సమకూర్చే పెన్నుతోనే మార్కింగ్
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం
మరికాసేపట్లో పార్లమెంటు భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ప్రారంభం కానున్న పోలింగ్
6 గంటలకు ఓట్ల లెక్కింపు
రాత్రికి విజేతను ప్రకటించే అవకాశం
ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిల మధ్య పోరు
మద్దతు ఇలా..
పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788
ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే
పోలింగుకు దూరంగా బీఆర్‌ఎస్ (4 రాజ్యసభ), బీజేడీ(7)
లెక్క ప్రకారం.. 386 ఓట్లు దక్కించుకున్నవారు విజేత
బలాబలాలు..
ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం.. ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం
ఇండియా కూటమికి 314 మంది ఎంపీల మద్దతు !
ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. ఎన్డీయే అభ్యర్థి గెలుపు లాంఛనమే!
బ్యాలెట్ ఓటింగ్
రహస్య బ్యాలెట్ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక
ప్రాధాన్య ఓట్లు వేసే పద్ధతి కావడం వల్ల బ్యాలెట్లనే వాడకం. ఈవీఎంలలో ఈ సదుపాయం లేదు.
తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఓట్లేయనున్న ఎంపీలు
అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లువస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలో తీసుకుంటారు.
నచ్చిన అభ్యర్థికే ఓటింగ్
తమ సభ్యులకు విప్ జారీచేయకూడదని పార్టీలకు ఎన్నికలసంఘం స్పష్టీకరణ.
ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం
ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా ప్రచారం చేసిన ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులు
గత రెండ్రోజులుగా ఎంపీలందర్నీ ఢిల్లీకి రప్పించి ఓటింగుకు సమాయత్తం చేసిన ఇరు కూటములు
ఇప్పటికే ముగిసిన నమూనా(మాక్) పోలింగ్
గతంలో.. ఫస్ట్ టైం..
2022 ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక
ఓట్లేసిన 725 మంది ఎంపీలు
ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌కు 528 (74.37%), ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాకు 182 (25.63%) దక్కిన ఓట్లు
15 ఓట్లు చెల్లలేదు. 55 మంది ఓటింగుకు గైర్హాజరు
2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ.. తగ్గిన ఎన్డీయే సంఖ్యాబలం