సాక్షి, ఢిల్లీ: తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ ఎంపీ.. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడిపై ప్రముఖ న్యూస్ యాంకర్ అర్నబ్ గోస్వామి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ పరిణామాలపై విమానయాన శాఖ మంత్రిగా కాకుండా.. మరెవరిని ప్రశ్నించాలంటూ నిలదీశారాయన.
ఇండిగో సంక్షోభ వ్యవహారంలో కేంద్ర మంత్రిగా రామ్మోహన్‌నాయుడి వైఫల్యాన్ని ఇంతకు ముందు అర్నబ్ ప్రశ్నించారు. ఇండిగోపై సమీక్ష జరపడానికి అసలు లోకేష్ ఎవరంటూ నిలదీశారు. అయితే ఈ వైఫల్యాన్ని.. లోకేష్‌ను ఎత్తి చూపడాన్ని టీడీపీ తట్టుకోలేకపోయింది. తప్పు చేసినా తమను ప్రశ్నించవద్దనే తీరుతో టీడీపీ నేతలు.. రిపబ్లికన్ టీవీని బ్యాన్ దిశగా అడుగులు వేసింది. దీంతో అర్నబ్ అనూహ్య చర్యకు దిగారు.
స్టూడియోలో ఖాళీ కుర్చీ వేయించి మరీ.. కేంద్రమంత్రిని కాకుండా ఇంకెవరిని ప్రశ్నించాలంటూ టీడీపీ అండ్ కోను కడిగిపారేశారు. లక్షల మందిని ఇబ్బంది పెట్టిన మంత్రిని నిలదీయకూడదనడం ఎంత వరకు కరెక్ట్ అని ఏకిపారేశారు.


