సాక్షి, కోనసీమ: విద్యా, వైద్యం అనేవి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలని.. దురదృష్ట శాత్తు కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంతో పాటు పలు సమస్యలపై సోమవారం ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేట్పురం చేయాలన్న నిర్ణయం వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు కార్యక్రమాన్ని చేపట్టాం. ఈనెల 10వ తేదీన సేకరించిన సంతకాలను ఆయన జిల్లాల కేంద్ర కార్యాలయాలకు తరలిస్తాం. 15వ తేదీన జిల్లాల నుంచి సేకరించిక సంతకాల పేపర్లను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలిస్తాం. ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు తన తాబేదార్లకు మెడికల్ కళాశాల కట్టుపెట్టి ప్రయత్నం చేస్తోంది. రానున్న కాలంలో వైద్యం ప్రైవేటు చేతుల్లోకి పూర్తిగా వెళితే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతారు.
.. గడచిన 18 నెలల్లో ప్రభుత్వం ఏ రంగంలోనూ వృద్ధి సాధించలేదు. 18 నెలల్లో ఎన్ఆర్ఈజీఎస్లో ఏడు కోట్ల పని దినాలు తగ్గించారు. ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోతోంది. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పేదలకు పని దినాలు కల్పించలేని ఈ ప్రభుత్వం.. అద్భుతమైన ఉద్యోగాలు కల్పిస్తామని ఎలా హామీ ఇస్తుంది?.
పేరెంట్స్ మీటింగ్ జరిగిన పాఠశాలలు ఐదేళ్ల క్రితం ఎలా ఉన్నాయో?.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చంద్రబాబు గమనించారా.?. రాష్ట్రంలో సాగయ్యే ఈ పంటకు కనీస మద్దతు ధర లేదు. రైతులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాలు ఈ ప్రభుత్వంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి.
మంత్రులు అకౌంటబిలిటీతో మాట్లాడాలి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. గడచిన 18 నెలల్లో రాస్తున్న క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. హత్యలు, మానభంగాలు చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. ప్రజల తరపున పోరాటం చేస్తాం. అన్ని వర్గాలకు అండగా ఉంటాం’’ అని బొత్స అన్నారు.


