
యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. న్యూయార్క్ క్వీన్స్ వేదిక వద్దకు ట్రంప్ రాక సందర్భంగా భద్రతా తనిఖీలతో అభిమానులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో.. అర్థర్ యాష్ స్టేడియం రోల్స్ బాక్స్ వద్దకు వచ్చి అభివాదం చేసిన ఆయనకు.. చీర్స్‌తో పాటు బూస్(నిరసనగా చేసే నినాదాలు) స్వాగతం పలికాయి. తమను ఇబ్బందిపెట్టినందుకు టెన్నిస్ అభిమానులు ఆయన్ని తిట్టిపోశారు. ఈ క్రమంలో.. మరో ఆసక్తికరమైన అంశమూ తెర మీదకు వచ్చింది.
ట్రంప్ మనవరాలు అరబెల్లా కుష్నర్(18) ఆయన తీరుతో ఇబ్బందిపడినట్లుగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ట్రంప్ మొదటి భార్య ఇవానా కూతురు ఇవాంకా. ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్ కాగా.. వీళ్లిద్దరికి ముగ్గురు సంతానం. అందులో పెద్ద కూతురు అరబెల్లా. ట్రంప్ కుటుంబంతో తరచూ ఈమె మీడియా కంట కనిపిస్తుంటుంది. ఈ క్రమంలో యూఎస్ ఓపెన్ పురుషుల ఫైనల్ మ్యాచ్ కోసం ట్రంప్ అల్లుడిని, మనవరాలిని, వైట్‌హౌజ్ సిబ్బందినీ వెంటపెట్టుకుని వచ్చారు.
ఆ సమయంలో అరబెల్లా ఆందోళనగా కనిపించగా.. ట్రంప్ ఆమెతో ఏదో అన్నారు. దీంతో ఆమె ముఖం చిన్నబోయింది. ఆపై ట్రంప్ పక్కన నిల్చునేందుకు కూడా ఆమె అయిష్టంగా కనిపించింది. అప్పటి నుంచి ఈవెంట్ అయ్యేదాకా ఆమె ముభావంగా ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.
లిప్ రీడర్ నికోలా హిక్లింగ్ చెబుతోంది ఏంటంటే.. అరబెల్లా తన బ్యాగ్, ఫోన్ కోసం ఆందోళన వ్యక్తం చేసింది. Where is my bag?(నా బ్యాగ్ ఎక్కడ?) అని అడిగింది. దానికి ఆమె తండ్రి కుష్నర్ I don’t have it(నాకు తెలియదు) అని సమాధానమిచ్చారు. ఈలోపు.. తాత ట్రంప్‌ను తనకు దారి ఇవ్వమని కోరగా.. ఆయన నువ్వు అక్కడే ఉండు అని చెప్పారు. దీంతో ఆమె అయిష్టంగా అలా నిలబడి పోయారు.
ఇదిలా ఉంటే.. యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ట్రంప్ అక్కడ ఉన్న సమయంలో జరిగిన పరిణామాలను టెలికాస్ట్ చేయొద్దని బ్రాడ్‌కాస్టర్లకు సూచించింది. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ప్రెసిడెంట్ ట్రంప్‌నకు తగిలిన నిరసన సెగ, అంతకుమించి అరబెల్లా వైరల్ వీడియో బయటకు వచ్చేసింది.
ఈ వీడియో వైరల్ కావడంతో, నెటిజన్లు ట్రంప్ కుటుంబ సంబంధాలపై చర్చ ప్రారంభించారు. ఆమె ముఖంలో ఆందోళన, అసౌకర్యం స్పష్టంగా కనిపించిందని.. పాపం అంటూ మరొక యూజర్ కామెంట్ చేశాడు. అరబెల్లాకు ట్రంప్ పక్కన నిలబడడానికి ఇష్టపడలేదని.. అందుకే తండ్రి చెంతకు చేరిందని కొందరు అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరలో ట్రంప్ కుటుంబం నుంచి ఆమె బయటకు రావడం ఖాయమంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Arabella Kushner aged 13 in the green dress does not want to stand next to the pedophile. pic.twitter.com/seJ35nY1SB
— KT "Special MI6 Operation" (@KremlinTrolls) September 7, 2025