
సాక్షి, అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 11 మంది సీనియర్ ఐఏఎస్‌ను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావును బదిలీ చేస్తూ.. ఆ స్థానంలో కొత్త ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్‌ను నియమించింది.
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లను (IAS Transfer) బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఉత్తర్వులు జారీ చేసింది. శ్యామలరావును టీటీడీ నుండి వెనక్కి రప్పిస్తూ జీఏడీ (పాలిటికల్) ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. కొత్త ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్‌ను నియమించింది. జీ అనంత రామును పర్యావరణ అటవీ విభాగం నుండి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ఎంటీ కృష్ణ బాబును హెల్త్ విభాగం నుంచి రోడ్లు, భవనాలు శాఖకు బదిలీ చేసింది. అదనంగా ఇన్ఫ్రా & ఇన్వెస్ట్మెంట్స్ బాధ్యతలు కూడా కృష్ణబాబుకే అప్పగించింది.
ముఖేశ్ కుమార్ మీనాను జీఏడీ నుంచి రెవెన్యూ (ఎక్సైజ్) విభాగానికి బదిలీ చేస్తూ.. అదనంగా మైన్స్ విభాగం బాధ్యతలు అప్పగించింది. కాంతిలాల్ దాండేను రోడ్లు, భవనాలు నుంచి పర్యావరణ & అటవీ విభాగానికి బదిలీ చేసింది. అలాగే.. సౌరభ్ గౌర్‌ను సివిల్ సప్లైస్ నుంచి హెల్త్ శాఖ సెక్రటరీగా బదిలీ చేస్తూనే.. సివిల్ సప్లైస్ అదనపు బాధ్యతలు చూడమని కోరింది.
ఇక.. ప్రవీణ్ కుమార్‌ను మైన్స్ నుండి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా, శ్రీధర్‌ను మైనారిటీస్ వెల్ఫేర్ సెక్రటరీగా నియమించి.. కమీషనర్ బాధ్యతలు అదనంగా అప్పగించింది. అలాగే.. లేబర్ విభాగం సెక్రటరీగా ఎంవి శేషగిరి బాబుకు బాధ్యతలు అప్పగిస్తూ.. కమీషనర్ బాధ్యతలు అదనంగా అప్పగించింది. ఎం.హరి జవహర్ లాల్ (రిటైర్డ్)ను గవర్నర్ కార్యాలయం నుండి రెవెన్యూ (ఎండోమెంట్స్) విభాగానికి బదిలీ చేసింది. ఐఏఎస్‌ల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గత కొన్ని రోజులుగా తీవ్ర కసరత్తు చేశారు.