ఓల్డ్ సోఫా కవర్‌లను మూలన పడేయకుండా, వాటికి సరికొత్త అందాన్ని ఇచ్చింది రెచెల్ డిక్రూజ్. పాత సోఫా కవర్‌లను కాస్తా అందమైన చిక్ బ్యాక్‌లెస్ డ్రెస్‌గా మార్చి నెటిజనులను ఆశ్చర్యానందాలకు గురిచేసింది.
‘అద్భుత కళా సృష్టి’ అని నెటిజనులు ఆమెను ప్రశంసించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ సోఫా డ్రెస్ వీడియోకు 8 మిలియన్‌ల వ్యూస్ వచ్చాయి.సోఫా డ్రెస్‌ను ఒక కొలిక్కి తేవడానికి రెచెల్‌కు అయిదు గంటల సమయం పట్టింది.
అయితే దీనికి వచ్చిన స్పందన తన శ్రమను మరిచి΄ోయేలా చేసింది. ‘ఈ బ్యాక్‌లెస్ డ్రెస్‌ను సోఫా ఫ్యాబ్రిక్ నుంచి తయారుచేశారు’ అని చెబితే తప్ప తెలియనంత సహజంగా ఉండడం విశేషం.
(చదవండి: 200 ఏళ్లుగా అక్కడ దీపావళి లేదు..! కానీ మహాలయ అమావాస్యే..)


