దేశమంతా దివ్వెల కాంతులు అద్దుకుని, తారాజువ్వలతో నింగి కూడా మెరిసి΄ోయేది దీపావళి అమావాస్య నాటి రాత్రే! కానీ కర్ణాటక, దావణగేరేలోని లోకికేరే పల్లెలో మాత్రం సీన్ చిత్రంగా ఉంటుంది. ఆ ఊరివాసులు దాదాపు రెండువందల ఏళ్లుగా దీపావళి పండుగను జరుపుకోవట్లేదు. ఆ రాత్రి అక్కడ ముంగిళ్లలో దీపాల కొలువు.. టపాసుల సందడి కాదుకదా కనీసం వీధి దీపాలు కూడా వెలగని విషాదం కనిపిస్తుంది. దానికి ఒక నేపథ్యం ఉంది.
అదేంటంటే...
రెండు శతాబ్దాల కిందట.. దీపావళికి ముందు.. పండుగకోసం అవసరమైనవి తీసుకురావడానికి లోకికేరేకి చెందిన కొంతమంది యువకులు దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లారు. ఆ వెళ్లినవారు ఎంత పొద్దెక్కినా తిరిగి రాలేదు. గ్రామస్తులంతా ఆ అడవికి వెళ్లి అణువణువు గాలించారు. అయినా లాభం లేక΄ోయింది. వాళ్ల ఆనవాళ్లను కూడా కనిపెట్టలేకపోయారు. ఆ యువక బృందం ఆ రాత్రే కాదు.. ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆ బాధలో వాళ్లు దీపావళి జరుపుకోలేదు.
తర్వాత ఏడాదికీ ఆ విషాదాన్ని మరువలేక΄ోయింది ఆ గ్రామం. కొంతమంది పండుగ ఆనవాయితీకి అంతరాయం ఎందుకు కలిగించాలని ప్రయత్నించి పండుగ జరిపారు. యాదృచ్చికంగా వాళ్లు నష్టాలను చవిచూడటం, అనారోగ్యం, ఇంట్లో దొంగలు పడటం లాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు. కుర్రాళ్లు కనిపించకుండా ΄పోయిన బాధను మరిచి వాళ్లు పండుగ జరుపుకున్నందుకే ఆ అరిష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని నమ్మారు.
దాంతో ఆ నమ్మకమే స్థిరపడి నాటినుంచి ఆ ఊళ్లో దీపావళినాడు ఊరంతా దీపాలు వెలిగించి దీపావళి జరపకోవడాన్నే సంప్రదాయంగా మలుచుకున్నారు. అదలా ఇప్పటికి రెండువందల ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది.
అయితే...
మహాలయ అమావాస్యను మాత్రం ఆ పల్లెలోని పూర్వీకుల సంస్మరణ దినంగా పండుగ జరుపుకుంటారు. ఆ రోజు వాళ్ల సంప్రదాయ, సంస్కృతుల మేరకు దీపావళి నాడు చేయాల్సిన కార్యక్రమాలన్నిటినీ నిర్వహిస్తారు. అంటే మహాలయ అమావాస్యనాడు తమదైన తీరులో దీపావళి జరుపుకుంటారు. ఒకరకంగా మహాలయ అమావాస్యే వారికి దీపావళి. ఇదీ లోకికేరే దీపావళి కథ!
(చదవండి: దీపావళి 2025: ఆ పండుగ పేరుతోనే రెండు గ్రామాలు..కానీ అక్కడ..)


