సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్‌ అడ్రస్‌గా..ప్రధాని మోదీ డ్రెస్సింగ్‌ స్టైల్‌ | PM Modis signature outfit shines with a touch of Madhya Pradesh | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక వారసత్వాన్ని తలపించేలా.. ప్రధాని మోదీ సిగ్నేచర్‌ దుస్తులు..

Sep 17 2025 5:34 PM | Updated on Sep 17 2025 6:07 PM

PM Modis signature outfit shines with a touch of Madhya Pradesh

ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంతేగాదు ఆ పార్టీ శ్రేణులు తమ ప్రియతమ నేత పుట్టినరోజుని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు కూడా. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్‌లోని థార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలతో కాసేపు ముచ్చటించారు. అక్కడ మోదీ వేదికపైకి రాగానే ఆ రాష్ట్ర సాంస్కృతికి అద్దం పట్టే గులాబీ రంగు తలపాగా(పగ్డి), జాకెట్‌ను బహుకరించారు. 

ఆ పగ్డిపై(తలపాగ)  క్లిష్టమైన బంగారం, ముత్యాలతో ఎంబ్రాయిడరీ చేయడగా, బంజారా సమాజం శక్తిమంతమైన చేతి పనికి నిదర్శనం జాకెట్‌పై లంబానీ ఎంబ్రాయిడరీ ఉంది. వీటితోపాటు  ధార్‌ జిల్లాకు చెందిన ప్రసిద్ధ హ్యాండ్‌ బ్లాక్‌ ప్రింట్‌ వస్త్రం పై సహజరంగులతో కూడిన రేఖాగణిత నమునాలు ఉన్న స్కార్ఫ్‌ను కూడా మోదీకి బహుకరించారు. ఇది ఆయన 75వ పుట్టినరోజు అయినప్పటికీ తన సిగ్నేచర్‌ శైలికే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రజలు ఇచ్చిన అభిమాన బహుమతులు, దుస్తుల కారణంగా మోదీ డ్రెస్సింగ్‌ స్టైల్‌ సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆ కానుకలతో మోదీ లుక్‌లో మధ్యప్రదేశ్‌ సాంస్కృతిక వారసత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. 

ఆయన ఈ పుట్టినరోజుని  పీఎం మిత్ర పార్కుకి పునాది రాయి వేయడం, అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ ఆరోగ్య పథకాల ప్రారంభంతో జరుపుకోవడం విశేషం. ఇక ఆ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ..స్వావలంబన చర్య తీసుకోవాలనే పిలుపునిస్తూ ప్రసంగించారు. "ఇది పండుగల సమయం. మన స్వదేశీ ఉత్పత్తుల మంత్రాన్ని పునరావృతం చేస్తూ ఉండాలి. 140 మంది కోట్ల భారతీయులు ఏది కొనుగోలు చేసినా..అది మేడ్‌ ఇన్‌ ఇండియాగానే ఉండాలని అభ్యర్థిస్తున్నా. 

వికసిత్‌ భారత్‌కు మార్గం వేసి, ఆత్మనిర్బర్‌ భారత్‌గా ముందుకు సాగాలన్నారు. ఎప్పుడైతే మనం మేడ్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తులనే కొనుగోలు చేస్తామో, అప్పుడూ డబ్బు మన దేశంలోనే ఉంటుంది, పైగా ఆ డబ్బుని అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించవచ్చని అన్నారు. అలాగే మహేశ్వరి చీరలు, పీఎం మిత్రా పార్క్ ప్రాముఖ్యత గురించి కూడా ఆయన మాట్లాడారు. 

ఇక్కడ పట్టు, పత్తి లభ్యత, నాణ్యత తనిఖీలు, సులభమైన మార్కెట్ యాక్సెస్ వంటివి నిర్ధారిస్తారని అన్నారు. దాంతోపాటు స్పిన్నింగ్, డిజైనింగ్, ప్రాసెసింగ్, ఎగుమతి అన్నీ ఒకే చోట జరుగుతాయని చెప్పారు. అదీగాక ఈ చీరలు, వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా తమ ముద్ర వేస్తూ, దేవి అహల్యాబాయి హోల్కర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి..మన మాతృభూమిని ప్రపంచ మార్కెట్‌లో ప్రకాశవంతంగా మెరిసేలా చేయగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. .

(చదవండి: ప్రపంచంలోనే తొలి ఏఐ కేబినేట్‌ మంత్రి..! ఎందుకోసం అంటే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement