
బిగ్బాస్ 9 తెలుగు సీజన్లో ప్రస్తుతానికి తనూజ టాప్లో దూసుకుపోతుంది. ఓటింగ్ పరంగా చాలా పేజీలలో ఆమె ప్రథమ స్థానంలో ఉంది. అయితే, తెలుగులో ఆమెకు ముద్దమందారం సీరియల్ మంచి గుర్తింపు తెచ్చింది. బిగ్బాస్లో ఆమె టాప్లో ఉండటంతో ఈ సీరియల్‌కు సంబంధించిన టైటిల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది. మిలియన్ల కొద్ది వ్యూస్తో దూసుకుపోతుంది.
తనూజ అసలు పేరు తనూజ పుట్టస్వామి. అయితే, సినీ పరిశ్రమలో తనూజ గౌడగా స్థిరపడిపోయింది. కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ బెంగళూరు యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమెను ఒక టీచర్గా చూడాలని ఆమె తండ్రి కోరుకున్నాడు. కానీ, ఆమెకు సినిమా రంగం అంటే ఆసక్తి ఉండటంతో తన కలను సాధించుకోవడం కోసం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే, తన కాలేజీ రోజుల్లోనే హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

తన కాలేజీ రోజుల్లోనే తనూజకు మొదట కన్నడ హారర్ సినిమా '6-5=2'లో దక్కింది. ఆ తర్వాత దండే బాయ్స్ చిత్రంలో నటించింది. వాటితో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే తెలుగులో తొలి సీరియల్ 'అందాల రాక్షసి'లో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే ముద్దమందారంలో పార్వతి పాత్రతో మెరిసింది. మంచి నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు ఈ సిరీయల్ టైటిల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది.
తనూజ దెబ్బతో 27 మిలియన్లు దాటేసింది
బిగ్‌బాస్ సీజన్ ప్రారంభమైన సమయంలో కేవలం 6 మిలియన్ల వ్యూస్తో ఉన్న ఈ పాట.. ఇప్పుడు ఏకంగా 27 మిలియన్లతో దూసుకుపోతుంది. బిగ్బాస్లో తనూజ గేమ్ నచ్చిన వారు ఈ సాంగ్‌ను ఇప్పుడు చూస్తున్నారని తెలుస్తోంది. తనూజ వల్ల ఈ సాంగ్ ఏకంగా 20 మిలియన్ల వ్యూస్ అదనంగా రీచ్ తెచ్చుకుంది. తనూజ పుట్టస్వామి ఒక రియల్ గేమర్గా ఆడుతుంది. తనలో ఎమోషన్స్తో పాటు సెన్సిటివ్ కూడా ఉంది. మొదటి నుంచి టాస్క్ కూడా వదిలేయలేదు. కన్నడిగ అయినా సరే.., తెలుగులోనే చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. ప్రస్తుతానికి తనూజ మాత్రమే టాప్లో ఉంది.