విద్యార్థి ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం | tana board director potluri ravi supports student education | Sakshi
Sakshi News home page

విద్యార్థి ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం

Sep 9 2025 11:20 AM | Updated on Sep 9 2025 11:20 AM

tana board director potluri ravi supports student education

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్‌ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థి కె. ఈరన్న‌ ఇంటర్మీడియెట్‌ విద్యాభ్యాసానికి రవి పొట్లూరి రూ.1.5 లక్షలు సహాయం అందించి మోషన్ రెసిడెన్షియల్ కాలేజీలో  చదివిస్తున్నారు. 

రవి పొట్లూరి ప్రోత్సాహంతో ఈరన్న  ఇంటర్మీడియెట్‌ బైపీసీ  మొదటి సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి 440 మార్కులకుగాను 425 మార్కులు సాధించాడు. ఈరన్న చదువులో రాణించడం పట్ల రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ ఈరన్నను  అభినందించారు. కప్పట్రాళ్ళ గ్రామంలో పదవతరగతిలో టాపర్‌గా వచ్చిన ఈరన్న ప్రతిభను గమనించి రవి పొట్లూరి ఇంటర్మీడియెట్‌ చదువుకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా  రవి పొట్లూరి సహాయం మరువలేనిదని 

ఈరన్న‌ అన్నారు. తనలాంటి ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ అవ్వాలని తన కోరిక అని కష్టపడి చదువుకుని డాక్టర్ సీటు సాధించడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రతిభకల విద్యార్థులను ప్రోత్సహించడానికి తనవంతుగా కృషి చేస్తూనే ఉంటానని, సహకరిస్తున్న తానా ఫౌండేషన్ శశికాంత్ వల్లేపల్లికి  ఈ సందర్భంగా రవి పొట్లూరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్,  మోషన్ రెసిడెన్షియల్ కళాశాల కరస్పాండెంట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

(చదవండి: లండన్‌లో 'బెస్ట్‌ సమోసా'..! టేస్ట్‌ అదుర్స్‌..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement