
అమెరికాలో జరిగిన నాట్స్ 2025 సంబరాల కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ (Allu Arjun), హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ రాఘవేంద్రరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పుష్ప డైలాగ్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఇండియా నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. హైదరాబాద్ లేదా వైజాగ్‌లో ఉన్నట్లే అనిపిస్తోంది. అమెరికాలో ఇలా తెలుగువాళ్లందరూ కలవడమనేది అద్భుతం. నాట్స్ సంబరాలకు నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది.
తెలుగోళ్లంటే వైల్డ్ ఫైర్..
నాట్స్ గురించి పుష్ప స్టైల్‌లో చెప్పాలంటే.. 'నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్'. 'ఇండియన్స్ ఎక్కడున్నా తగ్గేదేలే.. అందులో తెలుగువాళ్లయితే అస్సలు తగ్గేదేలే..', 'తెలుగోళ్లంటే ఫైర్ అనుకున్నారా? వైల్డ్ ఫైర్' అని డైలాగ్స్ చెప్పాడు. బన్నీ డైలాగ్స్‌తో సభాప్రాంగణం విజిల్స్, అరుపులు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. చివర్లో యాంకర్ శ్రీముఖిని ఉద్దేశిస్తూ.. మీ యాంకరింగ్ మాత్రం రప్పా రప్పా అని పొగిడేశారు.
చదవండి: చిత్ర పరిశ్రమ ప్రథమార్ధం రిపోర్ట్.. మొత్తం ఎన్ని కోట్లు రాబట్టింది?