Photo Credit: X (Twitter)
చైనా మాస్టర్స్ సూపర్-750 టైటిల్ నెగ్గిన భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ రెడ్డి-చిరాగ్ శెట్టికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. "చైనా మాస్టర్స్ సూపర్ 750 టైటిల్ నెగ్గిన తొలి ఇండియన్స్‌గా నిలిచినందుకు మీకు అభినందనలు.
మీ కమ్‌బ్యాక్ నిజంగా ఒక అద్భుతం. మీ పట్టుదల, దృడ సంకల్పం, పోరాట స్ఫూర్తి యావత్ దేశానికి గర్వకారణం. రాబోయే సంవత్సరాల్లోనూ మీ జోడీ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని కోరుకుంటున్నా" అని పేర్కొన్నారు.
Heartiest congratulations to Satwiksairaj Rankireddy and Chirag Shetty on becoming the first Indians to win the China Masters Super 750 title with a spectacular comeback. Your grit, resilience, and fighting spirit have made the entire nation proud. Wishing you both many more… pic.twitter.com/Rm9Ia0Vzew
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 7, 2026
ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 11-21, 21-13, 21-17తో హెజి టింగ్-రెన్ గ్జియాంగ్ జోడీపై విజయం సాధించింది. చైనా గోడను బద్దలుకొట్టిన ఈ జోడికి ఇదే తొలి చైనా మాస్టర్స్ టైటిల్ కావడం విశేషం.
గతంలో వరుసగా రెండుసార్లు (2023, 2025లో) రన్నరప్‌గా నిలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ మూడో దఫాలో మాత్రం చాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది సాత్విక్, చిరాగ్ జోడీకి ఇది రెండో టైటిల్ కాగా, ఇటీవలే సింగపూర్ ఓపెన్ సూపర్-750 టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలోనూ ఈ జంట ఫైనల్‌కు చేరింది.
Read: సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర.. చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా!


