సౌతాఫ్రికా ఓపెనర్‌ విధ్వంసకర సెంచరీ.. 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో | Lhuan-dre Pretorius slams 101 versus Namibia | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా ఓపెనర్‌ విధ్వంసకర సెంచరీ.. 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో

Sep 4 2026 8:25 PM | Updated on Sep 4 2026 8:39 PM

 Lhuan-dre Pretorius slams 101 versus Namibia

విండ్‌హోక్ వేదిక‌గా న‌మీబియాతో జ‌రిగిన ట్రై సిరీస్ ఆరో మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాట‌ర్ లువాన్-డ్రే ప్రిటోరియస్ విధ్వంసక‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. 20 ఏళ్ల ప్రిటోరియ‌స్ ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై భారీ షాట్‌ల‌తో విరుచుకుప‌డ్డాడు. ఈ క్ర‌మంలో కేవలం 53 బంతుల్లోనే తన తొలి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 

సెంచరీ చేసిన అనంతరం ప్రిటోరియస్‌(101).. నమీబియా కెప్టెన్‌ గెర్హార్డ్ ఎరాస్మస్ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అతడితో పాటు మరో ఓపెనర్‌ కానర్ ఎస్టర్‌హుయిజెన్(40 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ సాధించింది. నమీబియా బౌలర్లలో జాన్ బాల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనలో నమీబియా కూడా సఫారీలకు ధీటుగా బదులిస్తోంది.
చదవండి: Asian Games 2026: ఆర్సీబీకి ప్లేయర్లకు లక్కీ ఛాన్స్‌.. టీమిండియాతో పాటు?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement