ఆర్సీబీకి ప్లేయర్లకు లక్కీ ఛాన్స్‌.. టీమిండియాతో పాటు? | RCB And KKR Stars Picked As Net Bowlers For Shreyas Iyer And Co | Sakshi
Sakshi News home page

Asian Games 2026: ఆర్సీబీకి ప్లేయర్లకు లక్కీ ఛాన్స్‌.. టీమిండియాతో పాటు?

Sep 4 2026 7:21 PM | Updated on Sep 4 2026 7:21 PM

RCB And KKR Stars Picked As Net Bowlers For Shreyas Iyer And Co

జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలను బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి భారత క్రికెట్ బోర్డు తమ పూర్తి స్థాయి జట్లను రంగంలోకి దింపుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్న పురుష, మహిళల జట్లు ఈసారి కూడా స్వర్ణ పతకాలను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం ముగ్గురు నెట్ బౌలర్లను ఎంపిక చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన రసిఖ్ సలాం దార్, యువ స్పిన్నర్ విక్కీ ఓస్త్వాల్‌లు ఈ జాబితాలో ఉన్నారని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం పేర్కొంది.

మ‌రోవైపు ఈ ఆసియా క్రీడ‌ల‌కు ముందు ఆతిథ్య దేశమైన జపాన్‌తో టీమిండియా ఓ టీ20 మ్యాచ్ ఆడ‌నుంది. భార‌త్‌-జ‌పాన్ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తి కావ‌స్తుందున ఈ మ్యాచ్ చారిత్ర‌త్మ‌క మ్యాచ్‌ను నిర్వ‌హించనున్నారు.  సెప్టెంబర్ 22న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఆసియా క్రీడల కోసం ఇండియన్ మెన్స్ టీమ్‌: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ సింగ్ రవ్నావ్, సోహవ్‌దీప్ బుమ్రా.

భారత మహిళల జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), G. కమలిని (వికెట్ కీప‌ర్‌), భారతీ ఫుల్‌మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్*, రాధా యాదవ్, నందిని శర్మ
చదవండి: క్రికెట్‌ హిస్టరీలోనే తొలిసారి.. జపాన్‌తో టీ20 మ్యాచ్‌ ఆడనున్న టీమిండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement