source: X
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ 2026లో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో రోటర్‌డామ్ రాకర్స్‌కు ఆడుతున్న అతడు.. నిన్న బెల్‌ఫాస్ట్ వుల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 11 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనప్పటికీ.. నోర్జే ప్రదర్శన అసాధారణంగా అనిపించింది. నోర్జేకు టీ20 క్రికెట్‌లో ఇదే తొలి 5 వికెట్ల ప్రదర్శన. తన 173వ టీ20 మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు.
🚨 ANRICH NORTJE IS BACK 😍
- Nortje has taken a five wicket haul in ETPL, great news for South Africa. pic.twitter.com/hJxJ7X2Oau— Johns. (@CricCrazyJohns) August 29, 2026
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెల్‌ఫాస్ట్ వుల్వ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం రోటర్‌డామ్ రాకర్స్ ఛేజింగ్ ప్రారంభించిన వెంటనే భారీ వర్షం మొదలవ్వడంతో కేవలం ఒక ఓవర్ ఆట మాత్రమే సాధ్యమైంది. దీంతో నిర్వహకులు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
మ్యాక్స్‌వెల్, కాన్వే సహా..!
ఈ మ్యాచ్‌లో నోర్జే సాధించిన వికెట్లలో టాప్ బ్యాటర్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (7), డెవాన్ కాన్వే (41) ఉన్నారు. వీరితో పాటు టిమ్ టెక్టార్ (14), హ్యారీ మనెంటి (30), లోర్కన్ టకర్ (0)ను కూడా నోర్జే ఔట్ చేశాడు. ఈ ఐదు వికెట్లలో మ్యాక్స్‌వెల్ వికెట్ హైలైట్‌గా నిలిచింది. అతడిని నోర్జే అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. బెల్‌ఫాస్ట్ ఇన్నింగ్స్‌లో టాప్-4 బ్యాటర్లను నోర్జేనే ఔట్ చేయడం మరో విశేషం.
కాగా, యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఇదే సీజన్‌తో మొదలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలోని ఆరు ఫ్రాంచైజీలకు భారత, విదేశీ క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు యజమానులుగా ఉన్నారు.
చదవండి: మెస్సీ విశ్వరూపం


