షఫాలీ పట్ల దురుసు ప్రవర్తన.. మూల్యం చెల్లించుకున్న పాక్‌ కెప్టెన్‌ | Fatima Sana fined for Shafali Verma sendoff gesture | Sakshi
Sakshi News home page

షఫాలీ పట్ల దురుసు ప్రవర్తన.. మూల్యం చెల్లించుకున్న పాక్‌ కెప్టెన్‌

Sep 7 2026 4:23 PM | Updated on Sep 7 2026 4:27 PM

Fatima Sana fined for Shafali Verma sendoff gesture

మహిళల ఆసియా కప్‌ 2026లో భాగంగా భారత్‌తో జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా ఓవరాక్షన్‌ చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మను ఔట్ చేసిన తర్వాత పెవిలియన్‌కు దారి చూపిస్తూ దురుసుగా ప్రవర్తించింది.

దీనిపై ఐసీసీ సీరియస్‌గా స్పందించింది. ఫాతిమా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్దారించి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. అలాగే ఆమె ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా జత చేసింది.

ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.5 ప్రకారం, బ్యాటర్ ఔటైన తర్వాత అతడిని లేదా ఆమెను అవమానించేలా ప్రేరేపించే భాష, చర్యలు, సంజ్ఞలు చేయడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఈ నిబంధన కింద ఫాతిమాపై లెవల్-1 ఉల్లంఘన నమోదైంది.

ఇది గత 24 నెలల్లో ఫాతిమా చేసిన రెండో నేరంగా ఐసీసీ పేర్కొంది. దీంతో ఆమె డీమెరిట్ పాయింట్ల సంఖ్య రెండుకు చేరింది. 2025 ఆగస్టు 6న డబ్లిన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లోనూ ఆమెకు ఒక డీమెరిట్ పాయింట్ లభించింది.

కాగా, శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే ఫాతిమా సనా వేసిన రెండో ఓవర్‌ మూడో బంతికి షఫాలీ ఆమెకే తిరిగి క్యాచ్ ఇచ్చి ఔటైంది. క్యాచ్ పట్టిన అనంతరం ఫాతిమా షఫాలీ ఓవరాక్షన్‌ చేసింది. ఫాతిమా ఎంత రెచ్చగొట్టేలా ప్రవర్తించినా, షఫాలీ స్పందించకపోవడం కొసమెరుపు. ఆ మ్యాచ్‌లో పాక్‌ భారీ ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ, ఫాతిమా బంతితో రాణించి మూడు వికెట్లు పడగొట్టింది.

ఇదిలా ఉం​టే, ఆసియా కప్‌లో పాక్‌కు ఇవాళ హాంగగ్‌కాంగ్‌ చైనాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే, ఆ జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. గ్రూప్‌-ఏ నుంచి భారత్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఇదివరకే సెమీస్‌కు చేరింది. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక సైతం ఇదిరకే సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. మరో బెర్త్‌ కోసం బంగ్లాదేశ్‌, యూఏఈ పోటీపడుతున్నాయి. 

చదవండి: 250 రిటైర్డ్‌ హర్ట్‌.. చరిత్రలో మూడో బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement