కెవిన్‌ పీటర్సన్‌కు కీలక బాధ్యతలు | Kevin Pietersen appointed Specialist Mentor of England Mens white ball setups | Sakshi
Sakshi News home page

కెవిన్‌ పీటర్సన్‌కు కీలక బాధ్యతలు

Sep 7 2026 3:53 PM | Updated on Sep 7 2026 4:00 PM

Kevin Pietersen appointed Specialist Mentor of England Mens white ball setups

source: X

ఇంగ్లండ్ క్రికెట్‌కు సంబంధించి ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లండ్ పురుషుల వైట్‌బాల్ జట్లకు అతడిని స్పెషలిస్ట్ మెంటర్‌గా నియమించారు. వచ్చే ఏడాది జరిగే మెగా టోర్నీ వరకు ఆయన జట్టుతో కలిసి పనిచేయనున్నారు.

పీటర్సన్‌కు తొలి అసైన్‌మెంట్ ఆస్ట్రేలియా పర్యటన కానుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలోనూ జట్టుతో పనిచేస్తారు. అనంతరం పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగే స్వదేశీ సిరీస్‌లకు కూడా అందుబాటులో ఉంటారు. కేపీ తన బ్యాటింగ్‌ అనుభవంతో ఆటగాళ్లకు సూచనలను అందిస్తారు.

2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. జింబాబ్వే, నమీబియా సహ ఆతిథ్య దేశాలుగా వ్యవహరించనున్నాయి. పీటర్సన్ జన్మస్థలం దక్షిణాఫ్రికానే కావడం ఈ నియామకానికి ప్రాధాన్యత తీసుకొచ్చింది.

బ్రెండన్ మెకల్లమ్ నేతృత్వంలోని ఇంగ్లండ్ వైట్‌బాల్ కోచింగ్ బృందంలో పీటర్సన్ భాగం కానున్నారు. ఈ బృందంలో మార్కస్ ట్రెస్కోథిక్, టిమ్ సౌథీ, సారా టేలర్, జీతన్ పటేల్ కూడా ఉన్నారు. గతంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటర్‌గా పనిచేసిన అనుభవం పీటర్సన్‌కు ఉంది.

కాగా, పీటర్సన్‌ 2014లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. 12 ఏళ్ల తర్వాత అతడు మళ్లీ ఇంగ్లండ్ సెటప్‌లోకి రానున్నాడు.  

చదవండి: 250 రిటైర్డ్‌ హర్ట్‌.. చరిత్రలో మూడో బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement