ఆసీస్‌తో సిరీస్‌కు పక్కనబెట్టారు.. కట్‌చేస్తే ట్రిపుల్‌ సెంచరీ | Towhid Hridoy-Historic-Triple-Century-UnOfficial-Test-Warning BCB-Comeback | Sakshi
Sakshi News home page

ఆసీస్‌తో సిరీస్‌కు పక్కనబెట్టారు.. కట్‌చేస్తే ట్రిపుల్‌ సెంచరీ

Sep 2 2026 7:51 PM | Updated on Sep 2 2026 8:12 PM

Towhid Hridoy-Historic-Triple-Century-UnOfficial-Test-Warning BCB-Comeback

Photo Credit: Twitter

బంగ్లాదేశ్ స్టార్ బ్యాట‌ర్ తౌహిద్ హ్రిదోయ్ ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచ‌రీతో మెరిశాడు. సౌతాఫ్రికా-ఎతో జ‌రుగుతున్న అన‌ధికారిక టెస్టు మ్యాచ్‌లో తౌహిద్ ఈ ఫీట్ న‌మోదు చేశాడు. 450 బంతుల్లో 25 ఫోర్లు, ఆరు సిక్స‌ర్ల‌తో త్రిశ‌త‌కం మార్క్‌ అందుకున్నాడు. ఈ నేప‌థ్యంలో ప‌లు రికార్డులు త‌న పేరిట లిఖించుకున్నాడు.

👉ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ త‌ర‌ఫున‌ ట్రిపుల్ సెంచ‌రీ బాదిన మూడో క్రికెట‌ర్‌గా తౌహిద్ హ్రిదోయ్ నిలిచాడు. గ‌తంలో త‌మీమ్ ఇక్బాల్‌, ర‌కీబుల్ హ‌స‌న్‌లు ఈ ఫీట్ సాధించారు.

👉విదేశీ గ‌డ్డ‌పై ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో త్రిశ‌త‌కం బాదిన తొలి బంగ్లాదేశ్ క్రికెట‌ర్‌గా తౌహిద్ చ‌రిత్ర సృష్టించాడు.  బంగ్లాదేశ్-ఎ త‌ర‌ఫున ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు చేసిన ఆట‌గాడిగాను నిలిచాడు. గ‌తంలో షహ్రియార్ హొస్సేన్ చేసిన 218 ప‌రుగులే రికార్డుగా ఉండేది. తాజాగా ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

👉ట్రిపుల్ సెంచ‌రీ ఒక రికార్డయితే, అదీ సౌతాఫ్రికా గ‌డ్డ‌పై రావ‌డం అరుదు. ఈ నేప‌థ్యంలోనే సౌతాఫ్రికా గ‌డ్డ‌పై ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచ‌రీ బాదిన రెండో ఓవ‌ర్సీస్ బ్యాట‌ర్‌గా తౌహిద్ నిలిచాడు. గ‌తంలో ఇంగ్లండ్ దిగ్గ‌జం డెన్నిస్ కాంప్ట‌న్ (1948-49లో) స‌రిగ్గా 300 ప‌రుగులు బాదాడు.

👉ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఆల్‌టైమ్ అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్లు సాధించిన జాబితాలో తౌహిద్ హ్రిదోయ్ చోటు ద‌క్కించుకున్నాడు. 350 ప‌రుగులు నాటౌట్‌గా నిలిచిన తౌహిద్ హ్రిదోయ్ నాలుగో స్థానంలో నిలిచాడు. కాగా మొద‌టి మూడు స్థానాలు వెస్టిండీస్ దిగ్గ‌జం బ్రియాన్ లారావే కావ‌డం విశేషం. ఫ‌స్ట్‌క్లాస్‌లో క్రికెట్లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు లారా (501 నాటౌట్‌) 1994లో వోర్విక్‌షైర్ త‌ర‌పున సాధించాడు. ఇక అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై (400 నాటౌట్‌) సాధించిన ఏకైక క్వాడ్ర‌పుల్ సెంచ‌రీ. ఇప్ప‌టికీ ఈ రికార్డు చెక్కు చెద‌ర‌లేదు. 1994లోనే ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టులో లారా (375 నాటౌట్‌) మ‌రోసారి మెరిశాడు.

బంగ్లా బోర్డుకు హెచ్చరిక‌
తాజాగా ట్రిపుల్ సెంచ‌రీతో తౌహిద్ హ్రిదోయ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (బీసీబీ) హెచ్చ‌రిక‌లు పంపాడు. బంగ్లా త‌ర‌ఫున ఏకైక టెస్టు మ్యాచ్ ఆడిన తౌహిద్‌ను ఆ త‌ర్వాత జ‌ట్టు నుంచి తొల‌గించారు. కానీ అరంగేట్రం స‌మ‌యంలో తౌహిద్ హ్రిదోయ్‌ను వైట్‌బాల్ స్పెష‌లిస్ట్‌గానే పరిగణించారు. ఇటీవలే ఆసీస్‌తో  జరిగిన టెస్టు సిరీస్‌కు తౌహిద్‌ హ్రిదోయ్‌ను పక్కనబెట్టారు.

కానీ త్రిశ‌త‌కంతో త‌నను టెస్టు జ‌ట్టులోకి తిరిగి తీసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చిందంటూ తౌహిద్ ప‌రోక్షంగా హెచ్చ‌రిక‌లు జారీ చేశాడు. 25 ఏళ్ల తౌహిద్ 25 ఫ‌స్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో 41 స‌గ‌టుతో 995 ప‌రుగులు సాధించాడు. బంగ్లాదేశ్ త‌ర‌ఫున 56 వ‌న్డేల్లో 1,698 ప‌రుగులు, 65 టీ20ల్లో 1,409 ప‌రుగులు సాధించాడు.

బంగ్లాకు 164 ప‌రుగుల ఆధిక్యం
ఇక మ్యాచ్ విష‌యానికొస్తే బంగ్లాదేశ్-ఏ త‌మ తొలి ఇన్నింగ్స్‌ను 676-8 వ‌ద్ద డిక్లేర్ చేసింది. తౌహిద్ హ్రిదోయ్ (481 బంతుల్లో 350 నాటౌట్‌; 27 ఫోర్లు, 10 సిక్స‌ర్లు) అజేయంగా నిలవ‌గా, జాక‌ర్ అలీ (94) తృటిలో సెంచ‌రీ చేజార్చుకోగా, మొహ‌మ్మ‌ద్ సైఫుద్దీన్ (87) రాణించాడు. చివ‌ర్లో ముస్కిఫ్ హ‌స‌న్ (31 నాటౌట్) మెరుపుల‌తో బంగ్లా 650 మార్క్‌ను క్రాస్ చేసింది. 

అనంత‌రం సౌతాఫ్రికా  నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి త‌మ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్టపోకుండా 6 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం 154 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉన్న సౌతాఫ్రికా-ఎ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 512 ప‌రుగుల‌కు ఆలౌటైంది. నినెతెంబా ఖుషిలే (121), లెసెగో సెనోక్‌వానె (111) సెంచ‌రీల‌తో మెర‌వ‌గా, గావిన్ క‌ప్ల‌న్ (97), కైల్ సిమ్మండ్స్ (66) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు.

 

Read: టెస్టు క్రికెట్‌పై తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement