breaking news
Rohit yadav
-
IND vs AUS: భారత జట్టులో మార్పులు.. ప్రకటించిన బీసీసీఐ
ఆస్ట్రేలియాతో తలపడే అండర్-19 జట్లలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మార్పులు చేసింది. రోహిత్ యాదవ్‌ను తప్పించి.. అతడి స్థానంలో యూత్ వన్డే, యూత్ టెస్టులకు ఇద్దరు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.అవును.. అది నిజమేకాగా దేశీ క్రికెట్లో బెంగాల్‌కు ఆడుతున్న లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్. వయసుకు సంబంధించి అతడు పత్రాలు సమర్పించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.‘‘ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో రాజ్‌కోట్, అహ్మాదాబాద్ వేదికలుగా జరిగే మ్యాచ్‌లకు సంబంధించి భారత అండర్-19 జట్టు నుంచి రోహిత్ వైదొలిగాడు. తన వయసుకు సంబంధించిన సరైన సమాచారం ఇవ్వలేకపోయినందున జట్టు నుంచి తప్పుకొన్నాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.ఇద్దరికి అవకాశంఇక రోహిత్ యాదవ్ నిష్క్రమణ నేపథ్యంలో జూనియర్ క్రికెట్ కమిటీ ఇద్దరు కొత్త ఆటగాళ్లను ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఆసీస్‌తో యూత్ వన్డేలకు సౌరాష్ట్ర ఆటగాడు ఆర్యన్ సావ్సానీ, యూత్ టెస్టులకు హర్యానా ప్లేయర్ తన్మయ్ బలోడాను ఎంపిక చేసినట్లు పేర్కొంది. కాగా సెప్టెంబరు 18- అక్టోబరు 8 మధ్య భారత్- ఆసీస్ మధ్య మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు జరుగుతాయి.ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో యూత్ వన్డేలకు భారత అండర్-19 జట్టు (అప్డేటెడ్)లక్ష్యా రాయ్‌చందాని (కెప్టెన్), యశ్వర్దన్ చౌహాన్ (వైస్ కెప్టెన్), రజత్ భగేల్ (వికెట్ కీపర్),ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, కుశాగ్రా ఓజా, అర్జున్ రాజ్‌పుత్, మనాల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), వి.యశ్వీర్, శవిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకట, కావ్యా పటేల్, ఆర్యన్ సావ్సానీ.యూత్ టెస్టులకు భారత అండర్-19 జట్టు (అప్డేటెడ్)యశ్వర్దన్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్యా రాయ్‌చందాని (వైస్ కెప్టెన్), సాగర్ విర్క్, కుశాగ్రా ఓజా, మనాల్ చౌహాన్, కుశ్ పటేల్, మానవ్ కృష్ణ (వికెట్ కీపర్), అభిప్రాయ్ బిస్వాస్ (వికెట్ కీపర్), ఇషాన్ ఓమ్, అయాన్ అక్రం, ప్రణవ్ రాఘవేంద్ర, ప్రియాన్షు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్, తన్మయ్ బలోడా.చదవండి: టీమిండియాతో ఏకైక టీ20.. జట్టును ప్రకటించిన జపాన్ -
62 మంది క్రికెటర్లపై నిషేధం యోచనలో బీసీసీఐ!
ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ కోసం భారత అండర్-19 జట్టుకు ఎంపికైన కొన్ని వారాలకే, తన వయసును తప్పుగా చెప్పాడనే ఆరోపణలపై బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ బయటపడింది. రోహిత్ యాదవ్ ఒక్కడే కాదు దాదాపు 62 మంది యువ క్రికెటర్లు వయసుకు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు తేలింది. ఈ 62 మంది క్రికెటర్ల వయసులో వ్యత్యాసాలున్నట్లు బయటపడడం సంచలనం కలిగిస్తోంది. పత్రాలు, వయస్సు సంబంధిత వ్యత్యాసాల కారణంగా, 2026-27, 2027-28 సీజన్లలో ఏ టోర్నమెంట్‌కైనా నమోదు లేదా బదిలీ చేసిన 62 మంది క్రికెటర్లను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అనర్హులుగా ప్రకటించింది. వీరిలోనే ప్రస్తుతం రెండేళ్ల నిషేధం పడిన రోహిత్ యాదవ్ కూడా ఉన్నాడు.దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఆ 62 మంది క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో పాటు తాను కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇక జాబితాలో రోహిత్ యాదవ్‌తో పాటు 2022 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రవికుమార్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ విశాల్ భట్టి కూడా ఉన్నారు. అయితే బెంగాల్ అసోసియేషన్ రికార్డుల్లో రవి వయసు అసలుతో పోలిస్తే 45 నెలల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించింది.రవితో పాటు ఇతర ఆటగాళ్లు కూడా వయసుకు సంబంధించి గణనీయమైన వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించినట్లు క్యాబ్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ 62 మంది ఆటగాళ్లకు సంబంధించిన అన్ని వివరాలను బీసీసీఐకి అందజేసినట్లు క్యాబ్ తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ తప్పుడు వయసు పత్రాలను చూపించిన 62 మంది యువ ఆటగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోనుందనేది ఆసక్తిగా మారింది.ఇక ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రోహిత్, జూలైలో జరిగిన అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి, ఆరు వికెట్లు తీసి, చివరి టెస్టులో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత కొన్నేళ్లుగా తన పుట్టిన సంవత్సరానికి సంబంధించి రోహిత్ వేర్వేరు పత్రాల్లో వేర్వేరు వివరాలు సమర్పించినట్లు సమాచారం. బెంగాల్ అసోసియేషన్‌కు 2014లో ఇచ్చిన వివరాల్లో తాను జూలై 7, 2007లో జన్మించినట్లు అతడు పేర్కొన్నాడు. అందులో తన చిరునామాను ఉత్తరప్రదేశ్‌గా పేర్కొన్నాడు. అయితే, 2017లో ఆధార్ అప్డేట్ సందర్భంగా తాను 2006లో జన్మించినట్లు రోహిత్ యాదవ్ తెలిపాడు. ఆ తర్వాత 2020, 2021లో మరోసారి అప్డేట్ చేసుకోగా.. ఈసారి తాను 2009లో జన్మించినట్లు పేర్కొన్నాడు.చదవండి: కౌంటీల్లో తొలి వికెట్ సాధించిన కశ్మీర్ సంచలనం -
BCCI: భారత క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం!
భారత అండర్-19 క్రికెటర్, బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన చర్యలు తీసుకుంది. వయసుకు సంబంధించి తప్పుడు ఆధారాలు సమర్పించాడనే కారణంతో రెండేళ్ల పాటు అతడిపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది.స్పోర్ట్స్ స్టార్ కథనం ప్రకారం.. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ ఆదేశాలను అమలు చేయాలని బీసీసీఐ పేర్కొన్నట్లు సమాచారం. కాగా రోహిత్ యాదవ్ ఇటీవలి కాలంలో భారత్ అండర్-19 జట్టు తరఫున మెరుగ్గా రాణిస్తున్నాడు.శ్రీలంక పర్యటనలోశ్రీలంక పర్యటనలో భాగంగా యూత్ టెస్టుల్లో రోహిత్ యాదవ్ ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో సెప్టెంబరులో జరిగే సిరీస్‌కు కూడా సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఆసీస్‌తో యూత్ వన్డే, యూత్ టెస్టులు ఆడే జట్టులో అతడికి చోటు దక్కింది.వేర్వేరుగా వివరాలుఅయితే, అనూహ్య రీతిలో రోహిత్ యాదవ్‌పై రెండేళ్ల పాటు నిషేధం పడటం గమనార్హం. కాగా గత కొన్నేళ్లుగా తన పుట్టిన సంవత్సరానికి సంబంధించి రోహిత్ వేర్వేరు పత్రాల్లో వేర్వేరు వివరాలు సమర్పించినట్లు సమాచారం. బెంగాల్ అసోసియేషన్‌కు 2014లో ఇచ్చిన వివరాల్లో తాను జూలై 7, 2007లో జన్మించినట్లు అతడు పేర్కొన్నాడు.అందులో తన చిరునామాను ఉత్తరప్రదేశ్‌గా పేర్కొన్నాడు. అయితే, 2017లో ఆధార్ అప్డేట్ సందర్భంగా తాను 2006లో జన్మించినట్లు రోహిత్ యాదవ్ తెలిపాడు. ఆ తర్వాత 2020, 2021లో మరోసారి అప్డేట్ చేసుకోగా.. ఈసారి తాను 2009లో జన్మించినట్లు పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో రోహిత్ యాదవ్ తీరుపై అనుమానం రాగా బెంగాల్ అసోసియేషన్ సమీక్షలో భాగంగా.. అతడు మోసానికి పాల్పడినట్లు తేలినట్లు సమాచారం. కాగా రోహిత్ యాదవ్ స్థానంలో కనిష్క్ చౌహాన్ లేదంటే మహ్మద్ ఎనాన్ ఆసీస్‌తో సిరీస్ ఆడే జట్టులో చేరే అవకాశం ఉంది.చదవండి: సిరాజ్‌తో పాటు ఇద్దరు టీమిండియా స్టార్లకు పిలుపు! -
ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా
భారత స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్-2026 జావెలిన్ త్రో క్వాలిఫయింగ్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐదోస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. కాగా స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్ నిర్వహించారు. నీరజ్ చోప్రాతో పాటు భారత్‌కే చెందిన రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో ఈటెను 76.28 మీటర్ల దూరం విసిరాడు.12 మందికి అర్హతఇక రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 79.61 మీటర్ల దూరం ఈటెను విసిరి ఐదో స్థానం దక్కించుకున్నాడు. కాగా మొత్తంగా 18 మంది జావెలిన్ త్రోయర్లు క్వాలిఫయింగ్‌లో పోటీపడ్డారు. అయితే, ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. నీరజ్ చోప్రాతో పాటు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ కూడా టాప్-12లో నిలిచి ఫైనల్లో అడుగుపెట్టారు.రోహిత్ యాదవ్ అత్యుత్తమంగా ఈటెను 78.37 మీటర్ల దూరం విసరగా.. యశ్వీర్ సింగ్ 78.36 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో వీరిద్దరు తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు. అగ్రస్థానం అతడిదేఇక శ్రీలంకకు చెందిన రుమేశ్ తరంగ పతిరగే 82.84 మీటర్ల దూరం ఈటెను విసిరి తొలి స్థానం దక్కించుకున్నాడు. మరోవైపు.. పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ 78.63 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి టాప్-7లో నిలిచాడు. కాగా భారత కాలమానం ప్రకారం ఆగష్టు 1న ఉదయం 12.45 గంటలకు జావెలిన్ త్రో ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. -
World Athletics Championships 2022: నేడు బరిలో నీరజ్ చోప్రా
భారత క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరుకు రంగం సిద్ధమైంది. భారత స్టార్ అథ్లెట్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా నేడు బరిలోకి దిగబోతున్నాడు. జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ ఈవెంట్లో అతనితో పాటు మరో భారత త్రోయర్ రోహిత్ యాదవ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. ఆటోమెటిక్ క్వాలిఫయింగ్ మార్క్ 83.50 మీటర్లు (లేదా) కనీసం టాప్–12లో నిలిస్తే ఫైనల్‌కు అర్హత లభిస్తుంది. ఉ.గం. 5.35 నుంచి సోనీ చానల్స్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ప్రిక్వార్టర్స్‌లో రాహుల్, రోహిత్ యాదవ్
గువాహటి: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన చిట్టబోయిన రాహుల్ యాదవ్, రోహిత్ యాదవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌ల్లో రాహుల్ 21–12, 21–11తో డి. జశ్వంత్ (ఆంధ్రప్రదేశ్)పై... రోహిత్ 21–19, 21–19తో ప్రతుల్ జోషి (రైల్వేస్)పై విజయం సాధించారు. ఈ ఇద్దరితోపాటు లక్ష్య సేన్ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), ఆలాప్ మిశ్రా (మధ్యప్రదేశ్), హర్షీల్ డాని (మహారాష్ట్ర), ఆర్యమాన్ టాండన్ (ఎయిరిండియా), కౌశల్ (మహారాష్ట్ర), సౌరభ్ వర్మ (పీఎస్‌పీబీ) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. మహిళల సింగిల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి (తెలంగాణ), గుమ్మడి వృశాలి (ఆంధ్రప్రదేశ్) నాలుగో రౌండ్లో ఓటమి చవిచూశారు. గాయత్రి 17–21, 17–21తో రియా ముఖర్జీ (రైల్వేస్) చేతిలో ఓడిపోగా... శ్రుతి ముందాడ (మహారాష్ట్ర)తో జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 19–21తో కోల్పోయి... రెండో గేమ్‌లో 2–10తో వెనుకబడిన దశలో వృశాలి గాయం కారణంగా వైదొలిగింది. -
చెస్ చాంపియన్ రామకృష్ణ
జింఖానా, న్యూస్‌లైన్: సైబర్ చెస్ అకాడమీ నిర్వహించిన ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో రామకృష్ణ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్స్‌లో భరత్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో నిలవగా... నాగ శశాంక్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మహిళల విభాగంలో వినీత టైటిల్ సాధించింది. నేహ రెండో స్థానాన్ని దక్కించుకుంది. జగ్మాంజర్ చెస్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో రోహిత్ యాదవ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆర్ ఎస్ శరణ్ రెండో స్థానంలో, మేఘనాశ్రమ్ మూడో స్థానంలో నిలిచారు. అండర్-8 విభాగంలో సాయి రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో నిలవగా... ప్రశాంత్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. అండర్-14 విభాగంలో అభిజిత్ రెడ్డి విజేతగా నిలవగా... రెండో స్థానాన్ని సాయి రోచిష్ కైవసం చేసుకున్నాడు. అండర్-12 విభాగంలో మొదటి స్థానాన్ని అనిరుధ్, రెండో స్థానాన్ని తేజస్ సొంతం చేసుకున్నారు. అండర్-6 విభాగంలో సాయి చాణిక్య, అండర్-10 విభాగంలో శ్రీకర్ టైటిల్ గెలుచుకున్నారు.


