భారత పారా ఆర్చర్లకు ఐదు పతకాలు | India shines at World Archery Para Series with two Gold and two silver and one Bronze | Sakshi
Sakshi News home page

భారత పారా ఆర్చర్లకు ఐదు పతకాలు

Sep 9 2026 4:48 AM | Updated on Sep 9 2026 4:48 AM

India shines at World Archery Para Series with two Gold and two silver and one Bronze

అహ్మదాబాద్‌: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌ స్టేజ్‌–3 టోర్నిలో భారత ఆర్చర్లు ఐదు పతకాలతో మెరిశారు. మంగళవారం భారత ఆర్చర్లు రెండు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు, ఒక కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో తోమన్‌ కుమార్‌–శ్యామ్‌ సుందర్‌ స్వామి (భారత్‌) 152–139తో అబ్బాస్‌–అన్వర్‌ (ఇరాక్‌)లపై గెలిచి బంగారు పతకం నెగ్గారు. పురుషుల రికర్వ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో హరి్వందర్‌ సింగ్‌–విజయ్‌ సుంది (భారత్‌) 6–2 (34–37, 36–31, 38–34, 35–31) సెట్‌ పాయింట్ల తేడాతో డేవిడ్‌ ఇవాన్‌–డెనిస్‌ ఇవాన్‌ (స్లొవేకియా)లపై విజయం సాధించి పసిడి పతకం గెలిచారు. 

మహిళల రికర్వ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో భావన–పూజ (భారత్‌) 0–6 (23–34, 33–35, 30–31) సెట్‌ పాయింట్ల తేడాతో లియాంగ్‌ కియురోంగ్‌–చెన్‌ యు (చైనా) చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకున్నారు. మిక్స్‌డ్‌ టీమ్‌ డబ్ల్యూ1 రికర్వ్, కాంపౌండ్‌ ఈవెంట్‌ ఫైనల్లో స్వాతి–ఆదిల్‌ మొహమ్మద్‌ నాజిర్‌ అన్సారి (భారత్‌) 1–5 (31–38, 33–37, 33–33) సెట్‌ పాయింట్లతో సర్కా ముసిలోవా–డేవిడ్‌ డ్రహోన్‌స్కయ్‌ (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓటమి పాలై రజత పతకం కైవసం చేసుకున్నారు. మహిళల వ్యక్తిగత డబ్ల్యూ1 కాంస్య పతక మ్యాచ్‌లో స్వాతి 6–2 (28–25, 27–27, 26–26, 26–24) సెట్‌ పాయింట్లతో ఎలీనా క్రుతోవా (కజకిస్తాన్‌)పై గెలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement