ఢిల్లీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో యువ పేసర్ యష్ ఠాకూర్‌ను ఆడించడాన్ని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తప్పుపట్టాడు. అతడు ఇండియన్ క్యాప్ ధరించేందుకు అర్హుడు కాదని శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా అఫ్గాన్‌తో టీ20లకు తొలుత ఎంపిక చేసిన జట్టులో యశ్‌ఠాకూర్‌కు చోటు దక్కలేదు.
కానీ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా దూరం కావడంతో ఆఖరి నిమిషంలో సెలక్టర్ల నుంచి అతడు పిలుపు అందుకున్నాడు. అయినప్పటికి తొలి రెండు టీ20లకు అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు కానీ. ఆఖరి టీ20లో మాత్రం అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతి ఇచ్చి యశ్‌కు తుది జట్టులో చోటు కల్పించారు.
ఈ మ్యాచ్‌లో అతడికి కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం లభించింది. రెండు ఓవర్లలో అతడు 17 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడిపై వరల్డ్‌కప్ విన్నర్ శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు.
"యష్ ఠాకూర్ లాంటి సాధారణ ఆటగాడికి భారత జట్టులో ఎలా చోటు ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఇలా ఎవరికి పడితే వారికి టీమిండియా క్యాప్ ఇస్తే.. జాతీయ జట్టులోకి రావడం చాలా సులభమనే తప్పుడు సంకేతాలు బయటకు వెళ్తాయి. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదు.
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే అద్భుతమైన ప్రతిభతో పాటు దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శనలు చేసిండాలి. భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ పేసర్లను పక్కన పెట్టి యష్ ఠాకూర్‌ను ఆడించడం అన్యాయం.
యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్ వంటి వారు కనీసం తమ ఐపీఎల్ ఫ్రాంచైజీల్లోనే రెగ్యులర్ సభ్యులుగా లేరు. అలాంటిది వారిని నేరుగా తీసుకొచ్చి భారత జట్టు తరఫున ఆడిస్తున్నారు.
మరోవైపు సడన్‌గా విప్రజ్ నిగమ్ జట్టులోకి ఎలా వచ్చాడు? ఏ ప్రాతిపదికన అతడిని ఎంపిక చేశారు? వరుణ్ చక్రవర్తికి ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసేంత గొప్ప బౌలరా అతడు? ఇలా ప్రతీ ఒక్కరికీ భారత జట్టు క్యాప్‌ను పంచేయలేరు. ఇదంతా చూస్తుంటే ఏదో షాప్‌లో టీమిండియా క్యాప్‌ను కొనుగోలు చేసినట్లుగా ఉంది" అని శ్రీకాంత్ తీవ్ర స్దాయిలో మండిపడ్డాడు.
చదవండి: నా కెరీర్‌లో అదే అత్యంత కఠిన నిర్ణయం: గౌతమ్ గంభీర్


